కాటేసిన మృత్యువు

23 Jul, 2018 07:50 IST|Sakshi
ట్రాక్టర్‌ ఇంజిన్‌ కింద వెంకటేష్‌ మృతదేహం

జిల్లా వ్యాప్తంగా చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరిని మృత్యువు మింగేసింది. ఈ కారణంగా బాధిత కుటుంబాల్లో విషాదం అలుముకుంది. ఇదేరోజు కల్లూరు మండలం కొంగనపాడు వద్ద చోటుచేసుకున్న  ప్రమాదంలో ఎనిమిది మంది గాయపడ్డారు. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.   

ట్రాక్టర్‌ బోల్తా.. వ్యక్తి మృతి 
గూడూరు రూరల్‌: గూడూరు సమీప ప్యాలకుర్తి రోడ్డులో ఉన్న ఎర్రమట్టి గుంతల్లో ఆదివారం ట్రాక్టర్‌ బోల్తా పడిన ఘటనలో గొల్ల వెంకటేష్‌(43) మృతి చెందాడు. ప్యాలకుర్తికి చెందిన వెంకటేష్‌కు భార్య గిడ్డమ్మ, కుమారుడు, కుమార్తె ఉన్నారు. వెంకటేష్‌ గొర్రెలు మేపుకొంటూ  జీవనం సాగించేవాడు. ఏడాది క్రితం గొర్రెలు అమ్ముకుని ట్రాక్టర్‌ లోడింగ్‌ పనులకు వెళ్తుండేవాడు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం ఎర్రమట్టి తరలించే నిమిత్తం ట్రాక్టర్‌ డ్రైవర్‌ భాస్కర్‌తో  కలిసి వెళ్లాడు.

మట్టి తవ్వకానికి అనువైన స్థలం కోసం డ్రైవర్‌ వెళ్లగా వెంకటేష్‌ ట్రాక్టర్‌ నడిపేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఇంజిన్‌ ఆన్‌ చేసి అదుపు చేయలేకపోవడంతో ట్రాక్టర్‌ బోల్తా పడింది. ఘటనలో వెంకటేష్‌ అక్కడికక్కడే మరణించాడు. గూడూరు ఎస్‌ఐ రాజాకుళ్లాయప్ప ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. కేసు నమోదు చేసినట్లు తెలిపారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా