బంపర్‌ ఆఫర్‌ ఇచ్చిన దొంగ!

7 Aug, 2019 08:15 IST|Sakshi

నెల్లూరు (క్రైమ్‌): ఇదొక వింతైన దోపిడీ. ఓ ఇంట్లో గుర్తుతెలియని దుండగుడు తల్లి, కుమార్తెను బెదిరించి రూ.2.50 లక్షల విలువైన 76 గ్రాముల బంగారు ఆభరణాలు దోచుకున్నాడు. తనకు రూ.లక్ష అవసరమని, ఆ నగదు ఇస్తే ఆభరణాలు ఇస్తానని దుండగుడు బాధితులతో బేరం పెట్టాడు. వారు డబ్బులు లేవనడంతో నగలతో పరారయ్యాడు. ఈ ఘటన మంగళవారం తెల్లవారుజామున బాలాజీనగర్‌ రాంజీనగర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు.. కోటకు చెందిన పి.వెంకటకృష్ణారెడ్డి, శ్రీలత దంపతులు. వెంకటకృష్ణారెడ్డి బియ్యం వ్యాపారి.

ఆరు నెలల కిందట కుమార్తె అన్వేషకి వివాహ నిమిత్తం రాంజీనగర్‌కు వచ్చారు. కుమార్తె వివాహానంతరం వెంకట కృష్ణారెడ్డి కోటకు వెళ్లారు. కుమార్తె ఆషాఢ మాసం కావడంతో తల్లితో కలిసి రాంజీనగర్‌లోనే ఉంది. ఈ క్రమంలో మంగళవారం తెల్లవారుజామున గుర్తుతెలియని దుండగుడు కిటికీ నుంచి కర్ర సాయంతో ఇంటి తలుపు గడియ తొలగించి ఇంట్లోకి వచ్చాడు. కప్‌బోర్డును తెరచి చూడగా అందులో ఏమీ కనిపించక పోవడంతో పడక గదిలో నిద్రిస్తున్న శ్రీలత, ఆమె కుమార్తెను నిద్రలేపి బంగారు ఆభరణాలు ఇవ్వాలని లేని పక్షంలో చంపుతామని బెదిరించాడు. శ్రీలత దిండుకింద ఉంచిన మూడున్నర సవర్ల బంగారు గొలుసు, ఆమె కుమార్తె మెడలోని 6 సవర్ల బంగారు గొలుసును లాక్కున్నాడు. 

రూ.లక్ష ఇస్తే నగలిచ్చేస్తా.. 
ఘటనలో నిందితుడు బాధితులకు బంపర్‌ ఆఫర్‌ ఇచ్చాడు. తనకు వ్యక్తిగత పనుల నిమిత్తం రూ.లక్ష అవసరమని, ఆ నగదు ఇస్తే దొంగిలించిన ఆభరణాలను తిరిగి ఇచ్చేస్తానని చెప్పుకొచ్చాడు. అయితే డబ్బులు లేవని చెప్పడంతో అక్కడి నుంచి పరారయ్యాడు. బాధితులు బాలాజీనగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మూడో తరగతి విద్యార్థి దారుణ హత్య 

ఫేస్‌బుక్‌ మోసగాడు అరెస్టు

పాల వ్యాపారితో.. వివాహేతర సంబంధం

కత్తి దూసిన ‘కిరాతకం’

300 కేజీల గంజాయి పట్టివేత

ఇద్దరు జీహెచ్‌ఎంసీ ఉద్యోగులు మృతి

ప్రభుత్వ మహిళా న్యాయవాది  హత్య కలకలం

ఏసీబీకి చిక్కిన అవినీతి ఆర్‌ఐ

సెల్ఫీ దిగి.. ఆత్మహత్యాయత్నం చేసిన మహిళ

‘ఆదిత్యను దారుణంగా హత్య చేశారు’

రెయిన్‌బో టెక్నాలజీస్‌ పేరుతో ఘరానా మోసం

ఘోరకలి నుంచి కోలుకోని కొత్తపల్లి

ఎదురొచ్చిన మృత్యువు.. మావయ్యతో పాటు..

స్పా ముసుగులో వ్యభిచారం..

బీటెక్‌ చదివి... ఏసీబీకి చిక్కి...

లోయలోకి వ్యాన్‌: ఎనిమిది మంది చిన్నారుల మృతి

‘రయ్‌’మన్న మోసం!

ప్రేమ వివాహం: అనుమానంతో భార్య, పిల్లల హత్య!

పోలీసునని బెదిరించి..

బాలుడి కిడ్నాప్‌ కేసును ఛేదించిన పోలీసులు

భార్య మొబైల్‌ వాడుతోందని..

విద్యార్థి దారుణ హత్య

దారుణం: రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తల మృతి

కండక్టర్‌ నగదు బ్యాగ్‌తో ఉడాయించిన యువకుడు

హాస్టల్‌లో అమానుషం ​; బాత్రూంలో మృతదేహం

అన్నానగర్‌లో మహిళ హత్య

రూ.10 వేల కోసం కుక్క కిడ్నాప్‌

‘సిగ్గు’లో కాలేసి అడ్డంగా బుక్కయ్యాడు!

నకిలీ ఆధార్‌ కార్డులతో వెట్టిచాకిరీ!

నిండు గర్భిణిని హతమార్చిన భర్త!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

కాజల్‌ చిత్రానికి అన్ని వీడియో కట్స్‌ ఎందుకు ?

అలాంటి సమయంలో ఫోన్‌ స్విచ్చాఫ్‌ చేసేస్తా

సినిమా కోసమే కాల్చాను!

ఇక సారీలుండవ్‌.. అన్నీ అటాక్‌లే : తమన్నా

శంకర్‌ దర్శకత్వంలో షారూఖ్‌ !

అరేయ్‌.. మగాడివేనా? : తమన్నా