జల్సాలు చేసేందుకే చోరీలు

26 Apr, 2019 07:44 IST|Sakshi
స్వాధీనం చేసుకున్న ఆభరణాలను చూపిస్తున్న రాచకొండ అడిషనల్‌ క్రైమ్స్‌ డీసీపీ శ్రీనివాస్‌

చోరీలకు పాల్పడుతున్న ఇద్దరి అరెస్ట్‌

తొమ్మిది లక్షల సొత్తు స్వాధీనం

సొంత ఇంటికే కన్నం వేసిన ఓ ఘనుడు

నాగోలు: జల్సాలకు అలవాటు పడి వరస దొంగతనాలకు పాల్పడుతున్న పాత నేరస్తులను ఎల్‌బీనగర్‌ సీసీఎస్‌ పోలీస్‌లు అరెస్టు చేసి వారి వద్ద నుంచి 13 తులాల బంగారం, 16 తులాల వెండి ఆభరణాలు, 30 మెబైల్‌ ఫోన్లు, ల్యాప్‌ టాపులు, 2 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకోని రిమాండ్‌కు తరలించారు. గురువారం సరూర్‌నగర్‌ సీసీఎస్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో రాచకొండ అడిషనల్‌ క్రైమ్స్‌ డీసీపీ  శ్రీనివాస్‌ తెలిపిన మేరకు..  సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన కోయిల కొండ రాధ కళ్యాణ్‌ (21) బీటెక్‌ విద్యార్థి. జల్సాలకు అలవాటు పడి ఇండ్లలో చోరీలకు పాల్పడడంతో పాటు తన ఇంట్లోనే 14 తులాల బంగారం చోరీ చేసిన ఘనుడు. నగరంలో 2017లో వనస్థలిపురం జైలుకు వెళ్లి వచ్చాడు. అయినా  ప్రవర్తన మార్చుకోకుండా మళ్లీ దొంగతనాలు మొదలుపెట్టాడు. హయత్‌నగర్, ఉప్పల్, మీర్‌పేట, చైతన్యపురి, సరూర్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్ల  పరిధిలో పలు ఇండ్లలో చోరీలు చేశాడు. దొంగతనాలు జరిగిన ప్రదేశంలో ప్రదేశంలో సేకరించిన వేలిముద్రల ఆధారంగా రాధ కళ్యాణ్‌ను గుర్తించి అరెస్ట్‌ చేసి అతని వద్ద నుంచి రూ.7.50 లక్షల విలువ గల మొబైల్‌ ఫోన్లు, బంగారం, హోరో హోండా అక్టీవ వాహనం స్వాధీనం చేసుకున్నారు. 

మరో పాత నేరస్తుడి అరెస్ట్‌..
వికారాబాద్‌ రాజీవ్‌ గృహకల్పకాలనీకి చెందిన సుర్మిళ్ల అరుణోదయ రాజు(33) ఆలియాస్‌ పింటూ అమెజాన్‌లో సూపర్‌వైజర్‌గా పనిచేసే వాడు జల్సాలకు అలవాటు పడి చోరీల బాటపట్టాడు. గతంలో వికారాబాద్, ముషీరాబద్‌ పోలీసులకు పట్టుబడి జైలుకు వెళ్లినన రాజ్‌ జైలు నుంచి వచ్చిన తరువాత గంజాయి స్మగ్లింగ్‌ కేసులో వికారాబాద్‌ ఎక్సైజ్‌ పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు.  తిరిగి వచ్చిన తరువాత ఎల్‌బీనగర్, హయత్‌నగర్‌ పరిధిలో చోరీలకు పాల్పడుతుపట్టుబడ్డాడు. బాయ్స్‌ హాస్టళ్లను  లక్ష్యంగా చేసుకొని చోరీలు చేసేవాడు. రాజ్‌ దొంగిలించిన మొబైల్‌ ఫోన్లను ఓఎల్‌ఎక్స్‌లో అమ్మేవాడు. ఇతనిపై నిçఘా పెట్టిన పోలీసులు అరెస్టు చేసి రూ.1.50 లక్షల విలువ గల చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్‌ చేసి వారిపైన ïపీడీ యాక్ట్‌ నమోదు చేయనున్నట్లు తెలిపారు. వీరి వద్దనుంచి దాదాపు రూ.9లక్షల రూపాయలు సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు వారు తెలిపారు. 

మరిన్ని వార్తలు