హీరో కారులో నగదు చోరీ

10 Nov, 2018 11:49 IST|Sakshi
పట్టుబడ్డ శ్యామ్సన్‌

కర్ణాటక, దొడ్డబళ్లాపురం  : గత సెప్టెంబరు నెల 28న నెలమంగల పట్టణంలో సినీహీరో వినోద్‌రాజ్‌ కారులో నగదు అపహరించిన కేసులో ప్రధాన నిందితుడిని నెలమంగల పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. నిందితుడు చిత్తూరు జిల్లా నగరి తాలూకా ఓజీ కుప్పం నివాసి శ్యామ్సన్‌గా గుర్తించారు. సెప్టెంబర్‌ 28న బ్యాంకు నుండి డ్రా చేసుకున్న నగదును తన కారులో పెట్టిన వినోద్‌రాజ్‌ నెలమంగల పట్టణంలోని ఒక వస్త్ర దుకాణం ముందు పంక్చర్‌ అయిన కారు టైర్‌ మారుస్తుండగా అక్కడకు వచ్చిన నలుగురు అపరిచిత వ్యక్తులు అభిమానులుగా పరిచయం చేసుకుని మాటల్లో దింపి కారులోని నగదు మాయం చేశారు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నవంబర్‌ 7న పట్టణంలోని ఒక బ్యాంక్‌ ముందు శ్యామ్సన్‌ చోరీ చేయడానికి కాపుకాచి ఉండగా అనుమానం వచ్చిన పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా వినోద్‌రాజ్‌ కారులో నగదు చోరీ చేసింది తామేనని ఒప్పుకున్నాడు. పరారీలో ఉన్న మరో ముగ్గురు చిన్న, తులసి, నరేశ్‌ల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

వేంపాడు వద్ద గంజాయి పట్టివేత

వ్యభిచార గృహంపై పోలీసుల దాడి

రాకేష్‌ రెడ్డి అక్రమాలు ఇంతంత కాదయా 

కత్తుల రవికి బెయిల్‌ మంజూరు

భార్యను హతమార్చిన భర్త ఆత్మహత్య

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

మహేష్‌.. శభాష్‌! 

సరికొత్త సిరివెన్నెల 

నయా సినిమా.. నయా లుక్‌

డబుల్‌ ధమాకా!

మరో సౌత్‌ రీమేక్‌

నిర్మాత రాజ్‌కుమార్‌ బర్జాత్య మృతి