బెజవాడలో రౌడీషీటర్‌ హత్య

7 Dec, 2017 01:34 IST|Sakshi
సుబ్బు (ఫైల్‌), హత్యకు గురైన సుబ్బు

పట్టపగలు నడిరోడ్డుపై నరికి చంపిన ప్రత్యర్థులు

విజయవాడ/తెనాలిరూరల్‌: విజయవాడ టీడీపీలో వర్గ విభేదాలు హత్యా రాజకీయాలకు దారితీశాయి. టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అనుచరుడు, పేరుమోసిన రౌడీషీటర్‌ వేమూరి సుబ్రహ్మణ్యం అలియాస్‌ సుబ్బును ప్రత్యర్థులు బుధవారం పట్టపగలు నడిరోడ్డుపై నరికి చంపారు. అతనికి టీడీపీ విజయవాడ తెలుగు యువత అధ్యక్షుడు కాట్రగడ్డ శ్రీనుతోనూ, తెనాలిలో పాత ప్రత్యర్థులతోనూ దీర్ఘకాలంగా విభేదాలున్నాయి. 

పక్కా పథకంతోనే..
అయ్యప్ప మాలధారణలో ఉన్న రౌడీషీటర్‌ సుబ్బు టూవీలర్‌పై విజయవాడ మాచవరం డౌన్‌కు బుధవారం ఉదయం 11 గంటలకు చేరుకున్నాడు. అక్కడ ఉన్న  బెంచిపై కూర్చుని మాట్లాడుతుండగా.. మూడు బైక్‌లపై ఆరుగురు దూసుకొచ్చారు. వారిలో ముగ్గురు అయ్యప్ప మాలధారణలో ఉన్నారు. తనపై దాడిని ఊహించిన సుబ్బు పరుగులు తీశాడు. ఆరుగురూ సుబ్బును వెంటాడి కత్తులు, గొడ్డళ్లతో దాడి చేశారు. వందమీటర్ల దూరంలో కింద పడిపోయిన సుబ్బును విచక్షణా రహితంగా కత్తులు, గొడ్డళ్లతో నరికేశారు. దాదాపు 16 చోట్ల  నరికేశారు.ఇద్దరు ట్రాఫిక్‌ కానిస్టేబుళ్లు గుర్తించి వెంటాడి నిందితులను అదుపులోకి సుకున్నారు.

టీడీపీలో తీవ్ర విభేదాలు 
విజయవాడ చేరిన సుబ్బు టీడీపీ నగర తెలుగు యువత అధ్యక్షుడు కాట్రాగడ్డ శ్రీను పంచన చేరి సెటిల్‌మెంట్లు చేయసాగాడు. కాట్రగడ్డ శ్రీనుతో విభేదాలు వచ్చి 2014 ఎన్నికల ముందు బోండా ఉమా మహేశ్వరరావుకు దగ్గరయ్యాడు. ఈ నేపథ్యంలోనే కాట్రగడ్డ శ్రీనుతో తీవ్ర విభేదాలు ఏర్పడ్డాయి. గత అక్టోబర్‌లో అక్రమంగా తుపాకుల కొనుగోలుతో హైదరాబాద్‌ పోలీసులు అరెస్ట్‌ చేసిన సుబ్రహ్మణ్యం ఇటీవల బెయిల్‌పై వచ్చాడు. తమను టార్గెట్‌ చేసి తుపాకులు కొనుగోలు చేశాడనే అనుమానంతోనే కాట్రగడ్డ శ్రీను వర్గీయులే సుబ్బును హతమార్చి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు