తిరుపతిలో రౌడీషీటర్‌ హత్య

22 Dec, 2019 08:27 IST|Sakshi
రక్తపుమడుగులో బెల్టు మురళి రోదిస్తు్తన్న మృతుడి కుటుంబీకులు

కత్తితో పొడిచారు..రాడ్‌తో తలపై కొట్టారు

పాత కక్షలే సంఘటనకు కారణమా ?

భయభ్రాంతులకు గురైన స్థానికులు

తిరుపతి క్రైం : తిరుపతి నగరంలో శనివారం సి నిమా ఫక్కీలో మాస్కులు ధరించిన దుండగులు ఓ వ్యక్తిని హత్య చేశారు. నగరం నడిబొడ్డులో ఈ సంఘటన జరిగింది. ఈస్టు సీఐ శివప్రసాద్‌రెడ్డి, స్థానికుల కథనం మేరకు నగరంలోని సంజయ్‌ గాంధీ కాలనీకి చెందిన మురళి అలియాస్‌ బెల్టు మురళి ఆటో తోలుకుని జీవనం సాగించేవాడు. శనివారం రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో తిరుమల బైపాస్‌ రోడ్డులోని ఎస్‌కే ఫాస్ట్‌ ఫుడ్‌ ప్రాంతానికి మురళి వెళ్లాడు. సన్నిహితుడిని పంపించి మద్యం బాటిల్‌ తీసుకుని రమ్మని చెప్పాడు. ఇంతలో కొంతమంది మురళిపై దాడికి ప్రయత్నించారు. అక్కడి నుంచి మూడు అడుగులు వేసేలోపే బలంగా కత్తితో కడుపులో పొడిచారు. తలపై రాడ్‌తో కొట్టారు. తల పగిలి అతడు అక్కడికక్కడే కుప్పకూలాడు, విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఎస్వీ మెడికల్‌ కళాశాలకు తరలించారు. ఇతనికి భార్య సత్య, ఇద్దరు కొడుకులు, కుమార్తె ఉన్నారు.

పాతకక్షలే కారణమా ?
2017 డిసెంబర్‌ రెండో తేదీ గిరిపురం వద్ద భార్గవ్‌ అలియాస్‌ ఐఎస్‌ మహల్‌ భార్గవ్‌ను కొందరు అతి దారుణంగా చంపారు. ఈ కేసులో బెల్ట్‌ మురళి ఏ2 ముద్దాయి. రౌడీషీటర్‌ కూడా నమోదైంది. అప్పటి నుంచి భార్గవ్‌కు సంబంధించిన వ్యక్తులు వీరిపై కక్షపెంచుకుని ఉంటారని స్థానికులు ఆరోపించారు. ఇటీవల భార్గవ్‌ రెండో వర్ధంతి జరిగిందని, అతడిని చంపినవారిని మట్టుపెట్టాలని ఆ సందర్భంగా కొందరు అన్నారని, దీనిపై మురళి కుటుంట సభ్యు లు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కౌన్సెలింగ్‌కు కూడా జరిగిందని తెలిపారు. ఈ నేపథ్యంలో పాతకక్షల కారణంగానే ఇతడిని దారుణంగా హత్య చేసి ఉండవచ్చని తెలిపారు.

ద్విచక్ర వాహనాలపై వచ్చి... నిత్యం రద్దీగా ఉండే తిరుమల బైపాస్‌ రోడ్డులో ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేయడాన్ని చూసిన స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. అందరూ చూస్తుండగానే మాస్కులు ధరించి మృతుడిపై దాడికి పాల్పడ్డారని స్థానికులు తెలిపారు. సుమారు ఆరుగురు ద్విచక్ర వాహనాలపై వచ్చి దాడికి పాల్పడినట్లు పలువురు పేర్కొన్నారు. కన్నీరుమున్నీరులా రోదన భర్త చనిపోయాడనే సమాచారంతో పిల్లలను తీసుకుని సంఘటన స్థలానికి మురళి భార్య చేరుకుంది. భర్త మృతదేహాన్ని చూసి ఒక్కసారిగా గుండెపగిలేలా రోధించింది. నాన్నా లేనాన్నా ... ఎందుకు రక్తం వస్తోందంటూ పిల్లలు కూడా బోరున విలపించారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా