ఖరీదైన హెల్మెట్‌ కూడా కాపాడలేకపోయింది

15 Dec, 2017 19:30 IST|Sakshi

రూ. 22 లక్షల బైక్‌, రూ.50వేల హెల్మెంట్‌, రూ.30వేల విలువైన బైకింగ్‌ గేర్‌ ఏమీ.. 30 ఏళ్ల సేల్స్‌ మేనేజర్‌ రోహిత్‌ను కాపాడలేకపోయాయి. జైపూర్‌లోని జేఎన్‌ఎల్‌ మార్గ్‌ వరల్డ్‌ ట్రేడ్‌ పార్క్‌ సమీపంలో ఘోర బైక్‌ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో జాగ్వార్‌ అండ్‌ ల్యాండ్‌ రోవర్‌ షోరూంలో పనిచేసే రోహిత్‌ సింగ్‌ అనే సేల్స్‌ మేనేజర్‌ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. రోహిత్‌ రూ.50వేల విలువైన హెల్మెట్‌ పెట్టుకున్నప్పటికీ ఆయన ప్రాణాలను కాపాడుకోలేకపోయాడు. రోడ్డు మార్గంలో యూటర్న్‌ తీసుకుంటున్న ఇద్దరు యువకులను కాపాడబోయి రోహిత్‌ ఈ ప్రమాదానికి గురయ్యాడు. రోహిత్‌ బైక్‌ స్కిడ్‌ అయి, కిందకి పడిపోయాడు. 

హెల్మెట్‌ పెట్టుకున్నప్పటికీ తలకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడ ఉన్న స్థానికులు గుమ్ముగూడి హెల్మెట్‌ను తొలగించడానికి ప్రయత్నించినప్పటికీ, ఆ ఖరీదైన హెల్మెట్‌ను మాత్రం తొలగించలేకపోయారు. తీవ్ర రక్తస్రావం అయిన రోహిత్‌ అక్కడికక్కడే మరణించాడు. రోహిత్‌ హెల్మెట్‌ను తొలగించడం రాకపోయే సరికి, అతన్ని వెంటనే స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు హెల్మెట్‌ను కట్‌ చేసి తీశారు. రోహిత్‌ పెట్టుకున్న రూ.50వేల హెల్మెట్‌తో పాటు బైకింగ్‌ గేర్‌ విలువ కూడా రూ.30వేల వరకు ఉంటుంది. ఖరీదైన బైకింగ్‌ గేర్‌, హెల్మెట్‌ ఏవీ కూడా ఈ ప్రమాదం నుంచి రోహిత్‌ను కాపాడలేకపోయాయి.  ఈ ప్రమాదంలో అఖిలేష్‌ కుమార్‌ అనే మరో యువకుడు కూడా తీవ్రంగా గాయపడ్డాడు.

మరిన్ని వార్తలు