లాటరీ పేరిట రూ.70 లక్షల మోసం

26 Jul, 2019 14:04 IST|Sakshi

2015 నుంచి సాగుతున్న తతంగం

ఆలస్యంగా గుర్తించిన బాధితుడు

గురువారం కేసు నమోదు 

సాక్షి, అల్లిపురం (విశాఖ దక్షిణ): లాటరీ పేరిట పలు విడతల్లో రూ.70లక్షలు కాజేసిన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. సైబర్‌ క్రైం సీఐ వి.గోపీనాథ్‌ తెలిపిన వివరాల ప్రకారం... నగరానికి చెందిన బి.రామకృష్ణ అనే వ్యక్తి ఈ – మెయిల్‌కు 2015వ సంవత్సరంలో ఒక మెయిల్‌ వచ్చింది. అందులో వరల్డ్‌ లాటరీ ఆర్గనైజేషన్‌ నుంచి 250 గ్రేట్‌ బ్రిటిష్‌ పౌండ్స్‌ గెలుచుకున్నారన్నది సారాంశం. దీంతో రామకృష్ణ తిరిగి వారు అడిగిన సమాచారం అందించాడు. తరువాత ఫాస్టర్‌ న్యూ మాన్‌ అనే వ్యక్తి +448726148738 నంబరు నుంచి ఫోన్‌ చేశాడు. తాను హెచ్‌ఎస్‌బీసీ యూకే బ్యాంకు నుంచి మాట్లాడుతున్నాను.., మీ ప్రైజ్‌ మనీ తమ యూకే బ్యాంకులో జమైంది, దానిని క్లెయిమ్‌ చేసుకోవాలంటే హెచ్‌ఎస్‌బీసీలో అకౌంట్‌ ఓపెన్‌ చేసుకోవాలని సూచించాడు. అందుకోసం కొంత సొమ్ము కట్టాలని, తరువాత తాము పంపే హెచ్‌ఎస్‌బీసీ ఏటీఎం కార్డు ద్వారా ఎక్కడి నుంచైనా ప్రైజ్‌ మనీ డ్రా చేసుకోవచ్చని చెప్పాడు. దీంతో బాధితుడు రూ.34,500 డిపాజిట్‌ చేశాడు. తరువాత వారు చెప్పిన విధంగా హెచ్‌ఎస్‌బీసీ యూకే ఏటీఎం కార్డు రావడంతో దాని యాక్టివేషన్‌ కోసం వరల్డ్‌ బ్యాంకుకు కొంత సొమ్ము కట్టాలని, యాంటీ టెర్రరిస్ట్, ఇన్సూరెన్స్‌ కోసం మరికొంత సొమ్ము కట్టాలని చెప్పడంతో డిపాజిట్‌ చేశాడు.

తరువాత గెలుచుకున్న ప్రైజ్‌ మనీని తమ రిప్రజెంటేటివ్‌ కెల్విన్‌ ఫిలిప్స్‌ మీ ఇంటికి తెచ్చి ఇస్తారని చెప్పడంతో... కెల్విన్‌ ఫిలిప్స్‌ను విశాఖపట్నం రైల్వేస్టేషన్‌లో రామకృష్ణ రిసీవ్‌ చేసుకున్నాడు. ఇంటికి వచ్చిన తరువాత ఫిలిప్స్‌ తెచ్చిన డిజిటల్‌ లాకర్‌ బాక్స్‌ను తెరిచి బ్లాక్‌ కోటెడ్‌ కరెన్సీని ఒక లిక్విడ్‌లో ముంచి కొన్ని చేంజ్‌ అయిన యూకే పౌండ్స్‌ను చూపించి నిజమేనని నమ్మించాడు. తరువాత తాను తెచ్చిన లిక్విడ్‌ అయిపోయిందని, అది తరువాత కొరియర్‌లో పంపుతానని చెప్పటంతో అది నిజమేనని నమ్మిన బాధితుడు వారి సూచించిన అకౌంట్‌లలో విడతల వారీగా రూ.70 లక్షలు డిపాజిట్‌ చేశాడు. అయితే ఎంతకీ లిక్విడ్‌ కొరియర్‌ రాకపోవటంతో జరిగిందంతా మోసం అని తెలుసుకొని గురువారం సైబర్‌ క్రైం పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. డబ్బులు ఊరికే రావని, మోసగాళ్ల చేతుల్లో మోసపోవద్దని, లాటరీల పేరిట వచ్చే మెసేజ్‌లు, లెటర్లు, ఈ మెయిల్స్‌ నమ్మవద్దని, వాటికి స్పందించవద్దని సీఐ గోపీనాథ్‌ హెచ్చరించారు.   

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

వేకువనే విషాదం

వానతో పాటు వస్తాడు... ఊడ్చుకుపోతాడు

వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురు ఆత్మహత్య

వ్యభిచారం గుట్టురట్టు

కాగజ్‌నగర్‌లో 144 సెక్షన్‌ 

ఉన్నావ్‌ ప్రమాదానికి కారణం అదే..

ఆంధ్రా సరిహద్దులో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరి మృతి

క్రెడిట్‌ కార్డు బిల్లు చెల్లించలేక...

జీతానికి.. దొంగలు?

పోలీస్‌ దొంగయ్యాడు 

రూ. 3 కోట్లు డిమాండ్; అబిడ్స్‌లో వదిలేశారు!

పా‘పాల’ భైరవుల ఆటకట్టు!

అనుమానంతోనే హత్య

అనుమానంతో పెళ్లైన ఐదు నెలలకే...

ఆస్తి పత్రాల కోసం దంపతుల కిడ్నాప్‌

డబుల్‌ దందా..

పక్కా ప్లాన్‌తో..పుట్టినరోజు నాడే...

30 గంటల్లో పట్టేశారు..!

‘ఉన్నావ్‌’ రేప్‌ బాధితురాలికి యాక్సిడెంట్‌ 

ప్రేమ జంట ఆత్మాహుతి

మృత్యు శకటం.. మృతుల్లో కొత్త పెళ్లి కొడుకు

కులాంతర వివాహం: తల్లిదండ్రులకు చిత్రహింసలు

పబ్‌పై పోలీసుల దాడి

రవిశంకర్‌ను పట్టిస్తే రూ.లక్ష 

బేగంపేటలో వింగర్‌ బీభత్సం 

‘ఇది ఎమ్మెల్యే కాలేజీ.. దిక్కున్నచోట చెప్పుకోండి’

బేగంపేటలో టాటా వింగర్‌ బీభత్సం

వికారాబాద్‌లో గుప్తనిధుల కలకలం

అప్పు తీర్చమని అడిగితే తల తెగింది..

విజయవాడ కరకట్ట మీద కారు బీభత్సం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

నా జాక్‌పాట్‌ సూర్యనే!

‘నా కథ విని సాయిపల్లవి ఆశ్చర్యపోయింది’

నోరు జారి అడ్డంగా బుక్కైన రష్మీక

ఆ ముద్ర  చెరిగిపోయింది

తలైవి కంగనా

పూణే కాదు  చెన్నై