రూ.79 లక్షల నకిలీ నోట్ల పట్టివేత

28 Oct, 2018 02:58 IST|Sakshi

మంథని: పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఎగ్లాస్‌పూర్‌ అటవీశాఖ చెక్‌పోస్టు వద్ద శనివారం రూ.79 లక్షల నకిలీ కరెన్సీ పట్టుబడింది. గోదావరిఖని ఏసీపీ రక్షిత కె మూర్తి కథనం.. ఎన్నికల సందర్భంగా ఎస్‌ఎస్‌టీ బృందం తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న షేఖ్‌ మస్తాన్‌ బ్యాగ్‌ను తనిఖీ చేశారు. 24 కట్టల్లో రూ.79 లక్షలు ఉన్నాయి. ‘పైనా.. కిందా అసలు నోట్లు పెట్టారు. మిగతాదంతా నకిలీ కరెన్సీ.

ఇందులో కేవలం రూ. 24 వేలు మాత్రమే ఒరిజినల్‌ నోట్లు’ అని ఏసీపీ చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం గుంటూరు జిల్లా తాడిపర్తి మండలం పిండుపాకకు చెందిన షేఖ్‌ మస్తాన్, వరంగల్‌ జిల్లా శాయంపేటకు చెందిన పొడిశెట్టి కృష్ణమూర్తి, భూపాలపల్లి జిల్లాకు చెందిన ఆకుల శంకర్‌లు ఈ నకిలీ కరెన్సీని తరలిస్తున్నారని తెలి పారు. డబ్బు దేనికోసం తరలిస్తున్నారనే విషయంపై ఆరా తీస్తున్నట్లు వివరించారు.

మరిన్ని వార్తలు