రహదారి రక్తసిక్తం

28 Aug, 2018 12:20 IST|Sakshi
ఆర్టీసీ బస్సును ఢీకొన్న ఆటో , అశోక్‌ మృతదేహం 

అల్గునూర్‌(మానకొండూర్‌):  కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్‌ మండలం అల్గునూర్‌లో కరీంనగర్‌, వరంగల్‌ రహదారి సోమవారం రాత్రి నెత్తురొడింది. ఒకేచోట జరిగిన పది నమిషాల వ్యవధిలో జరిగిన రెండు ప్రమాదాల్లో ఒకరు మృతిచెందగా ఇద్దరు గాయపడ్డారు.

 ఎల్‌ఎండీ ఎస్సై నరేశ్‌రెడ్డి, స్థానికుల కథనం ప్రకారం.. ఏలూరు నుంచి కొబ్బరి బోండాలతో మంచిర్యాలకు వెళ్తున్న డీసీఎం వ్యాన్‌ అల్గునూరు శివారులోని దుర్గమ్మగడ్డ ఆదివారం రాత్రివద్ద చెడిపోయింది. సోమవారం మరమ్మతు చేయించారు. మానకొండూర్‌ తహసీల్దార్‌ కార్యాలయంలో పనిచేస్తునన్న గంగిపల్లి గ్రామానికి చెందిన వీఆర్‌ఏ రాజు సాయంత్రం విధులు ముగించుకుని కరీంనగర్‌కు ద్విచక్రహనంపై బయల్దేరాడు. దుర్గమ్మగడ్డ వద్దకు రాగానే ఆగిఉన్న డీసీఎంను వెనుక నుంచి ఢీకొట్టాడు. ఈ సంఘటనలో రాజు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు అతడిని ఆస్పత్రికి తరలించారు.
 
10 నిమిషాల తర్వాత..
ప్రమాద సమాచారం అందుకున్న ఎల్‌ఎండీ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నసమయంలో మానకొండూరు మండలం గట్టు దుద్దెనపల్లి చెందిన శివరాత్రి అశోక్‌(35) ఆటోలో స్నేహితుడు కిషన్‌తో కలిసి కరీంనగర్‌వైపు వస్తున్నాడు. డీసీఎం వద్దకు రాగానే ఆటో అదుపుతప్పి డీసీఎంను ఢీకొట్టి.. ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఈ సంఘటనలో బస్సు పూర్తిగా ఆటోపైకి ఎక్కడంతో డ్రైవర్‌ అశోక్‌ అక్కడికక్కడే మృతిచెందాడు. వెనుక కూర్చున్న కిషన్‌ తీవ్రంగా గాయపడ్డాడు.

జేసీబీ సాయంతో మృతదేహం వెలికితీత..
ఆర్టీసీ బస్సు కింద ఇరుకున్న ఆటో నుంచి అశోక్‌ మృతదేహం వెలికి తీయడం కష్టం కావడంతో ఎల్‌ఎండీ ఎస్సై నరేశ్‌రెడ్డి జేసీబీని రప్పించి కష్టంమీద మృతదేహాన్ని బయటకు తీశారు. గాయపడిన కిషన్‌ను ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంలో ట్రాఫిక్‌కు అంతరాయం కలగడంతో హెడ్‌ కానిస్టేబుల్‌ సురేందర్‌ రెడ్డి, సిబ్బంది నయీం, యాదగిరి, మధు క్రమబద్దీకరించారు. ప్రమాదంపై విచారణ జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఒత్తిడి.. ఉక్కిరిబిక్కిరి!

మహిళపై సామూహిక అత్యాచారం

యువతిపై ప్రియుడి తల్లి కత్తిదాడి

కన్న కొడుకును చూడకుండానే..

ఆన్‌లైన్‌ మోసం..!

పెనుకొండలో కిడ్నాప్‌ కలకలం

ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి

అటవీ ప్రాంతంలో దారుణం.. మహిళ తలపై..

క్రికెట్‌ బెట్టింగ్‌ రాయుళ్ల అరెస్ట్‌

ప్రభుత్వాస్పత్రులే అడ్డాగా.. పిల్లల అక్రమ రవాణా! 

సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కు బౌన్స్‌

వైఎస్సార్‌సీపీకి ఓటు వేశారని దాడులు

రాజధానిలో మళ్లీ ఐసిస్‌ కలకలం

నలుగురు ఇంటర్‌ విద్యార్థుల ఆత్మహత్య

జూ పార్క్‌లో కూలిన భారీ వృక్షం.. మహిళ మృతి

జ్యోత్స్న మృతి కేసు : అంకుర్‌, పవన్‌ల అరెస్ట్‌

కర్నూలులో ఘోర ప్రమాదం

అపూర్వను గుడ్డిగా నమ్మాను : ఎన్డీ తివారి భార్య

సీఎం రమేష్‌ మేనల్లుడు ఆత్మహత్య

వరంగల్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

కొల్లేరు లంక గ్రామాల్లో అశ్లీల నృత్యాలు 

గుప్పు.. గుప్పుమంటూ..

కాయ్‌ రాజా కాయ్

ప్రాణం తీసిన మద్యం వివాదం

హత్యాయత్నం కేసుపై డీఎస్పీ దర్యాప్తు

పట్టుచీరల కేసు మాఫీకి యత్నం!

ఇళ్లు కట్టుకుందామంటే వద్దన్నారని..

పేద విద్యార్థినులను వ్యభిచారకూపంలోకి..

మహిళ దారుణ హత్య

కాంక్రీట్‌ మిక్సర్‌ కింద నలిగి వ్యక్తి దుర్మణం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అక్కడా మీటూ కమిటీ

మరోసారి జోడీగా...

కాపాడేవారెవరు రా?

రాణి పూంగుళలి

గ్యాంగ్‌ వార్‌

నేను నీరులాంటివాడిని