తప్పిన ఘోర ప్రమాదం

17 Sep, 2018 08:29 IST|Sakshi
సంఘటన స్థలంలో ప్రయాణికులు, స్థానికులు

నాగర్‌కర్నూల్‌ క్రైం: కాలం చెల్లిన బస్సులు.. సా మర్థ్యానికి మించి ప్రయాణికుల తరలింపు.. కొం దరు డ్రైవర్ల నిర్లక్ష్యం వెరసి.. ప్రయాణికుల జీవితా ల్లో చీకట్లు అలుముకుంటున్నాయి. జిగిత్యాల జి ల్లా కొండగట్టు వద్ద జరిగిన ఆర్టీసీ బస్సు బో ల్తాపడి 62మంది దుర్మరణం పాలైన విషాద సంఘటనను మరవకముందే అలాంటి ఘోర ప్ర మాదమే త్రుటిలో తప్పింది. ఈ ప్రమాదంలో నుంచి ప్రయాణికులు మృత్యువు అంచు దాకా వెళ్లి క్షేమంగా బయటపడ్డారు. బిజినేపల్లి మం డలం వట్టెం సమీపంలో ఆదివారం ఉదయం జరిగిన బస్సు ప్రమాదం ప్రభుత్వం, అధికారుల తీ రును ప్రశ్నిస్తోంది. వీఆర్వో పరీక్షకు వెళ్తున్న నిరుద్యోగ అభ్యర్థులకు సరిపడా బస్సులు లేకపోవడంతో పరిమితికి రెండింతలు మించి ఎక్కడంతో ఆర్టీసీ బస్సు టైర్‌ రాడ్‌ ఊడిపోయి పొలంలోకి దూ సుకెళ్లింది. ఈ ఘటనలో 11 మందికి తీవ్రంగా గా యపడ్డారు. వీరిలో ఏడుగురిని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించారు.
  
వీఆర్‌ఓ పరీక్షకు వెళ్లి.. 
వీఆర్‌ఓ పరీక్ష జరగనుండటంతో హైదరాబాద్, రంగారెడ్డి తదితర ప్రాంతాల నుంచి అభ్యర్థులు వనపర్తి జిల్లాకేంద్రంతోపాటు చుట్టు పక్కల గ్రామాల్లోని సెంటర్లలో పరీక్ష రాసేందుకు బయలుదేరారు. ఈ క్రమంలో ఆదివారం తెల్లవారుజామున హైదరాబాద్‌లో బయలుదేరిన యాదగిరిగుట్ట డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులో జడ్చర్లలో ఎక్కారు. దాదాపు వంద మందికిపైగా బస్సు లోపల, టాప్‌పై ప్రయాణికులతో బయలుదేరింది. బిజినేపల్లి మండలం వట్టెం సమీపంలోకి రాగానే బస్సు ముందు టైర్‌ ఊడిపోవడంతో అదుపు తప్పి రోడ్డు కిందకు వెళ్లింది. బస్సును అదుపు చేసేందుకు డ్రైవర్‌ విఫలయత్నం చేశాడు. దీంతో టాప్‌పై ప్రయాణిస్తున్న ప్రయాణికులు కుదుపులకు బస్సు మీద నుంచి చెల్లాచెదురుగా కిందపడి తీవ్రంగా గాయపడ్డారు. ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు.

ఘటనస్థలిలో ఆర్తనాదాలు 
బస్సు ఒక్కసారిగా అదుపు తప్పడం, పక్కకు ఒరిగిపోవడం, బయట నుంచి ఆర్తనాదాలు వినిపిస్తునండటంతో లోపల ఉన్న ప్రయాణికులకు ఇవేమీ అర్థం కాలేదు. అయితే ఏదో ప్రమాదం జరిగిందన్న విషయాన్ని అర్థం చేసుకున్న వారంతా ఒక్కసారిగా బస్సు లోపలి నుంచి బయట పడేందుకు ఇబ్బంది పడ్డారు. బయటికి వచ్చే డోరు సైతం బిగుసుకుపోవడంతో.. బస్సు ముందు భాగం అద్దాలు పగులగొట్టి అందులోంచి బయటకు వచ్చారు. అయితే ప్రయాణికులలో అత్యధిక శాతం వీఆర్‌ఓ పరీక్షలు రాసే వారే కావడం.. ఒక్కొక్కరే ప్రయాణిస్తుండటంతో కొత్త వారైనా గాయపడిన తోటి ప్రయాణికులకు సురక్షితంగా ఉన్నవారు సఫర్యలు చేశారు.

ఆస్పత్రికి తరలింపు.. 
ప్రమాద సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను అంబులెన్స్‌లలో నాగర్‌కర్నూల్‌ జిల్లా ఏరియా ఆస్పత్రికి తరలించారు. జిల్లా ఆస్పత్రి ఆవరణ మొత్తం క్షతగాత్రులు, ప్రయాణికుల రోదనలతో దద్దరిల్లిపోయింది. సంఘటన విషయం తెలుసుకున్న పలువురు ఒక్కసారిగా ఆస్పత్రికి చేరుకోవడంతో ఆ ప్రాంతమంతా జనాలతో కిక్కిరిసిపోయింది. అయితే తీవ్రంగా గాయపడిన 11 మందిలో 9 మందిని హైదరాబాద్‌లోని నిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు.

మెరుగైన వైద్యం అందించండి 
నాగర్‌కర్నూల్‌: స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొం దుతున్న బాధితులను కలెక్టర్‌ ఈ.శ్రీధర్, ఎస్పీ సాయిశేఖర్‌ పరామర్శించారు. బాధితులతో మాట్లాడి ప్రమాదానికి గల కారణాలను, వివరాలను తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. వారి వెంట జేసీ శ్రీనివాస్‌రెడ్డి, డీఆర్‌ఓ మధుసూదన్‌నాయక్‌ తదితరులున్నారు.  అనంతరం టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు రఘనందన్‌రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సుబ్బారెడ్డి తదితరులు పరామర్శించారు.

మరిన్ని వార్తలు