ఇసుక మాఫీయా.. సామాజిక కార్యకర్త దారుణ హత్య

5 Jan, 2020 11:17 IST|Sakshi

పట్నా : బిహార్‌లో దారుణ హత్య కలకలం రేపింది. రెండు రోజలు క్రితం కనపడకుండా పోయిన ఆర్టీఐ కార్యకర్త శవమై కనిపించాడు. పోలీసుల వివరాల ప్రకారం.. పట్నాకు చెందిన సామాజిక కార్యకర్త పంకజ్‌ కుమార్‌ గురువారం నుంచి కనిపించకుండాపోయాడు. కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. అతని కోసం గాలింపు ప్రారంభించారు. ఈ క్రమంలోనే శనివారం అర్థరాత్రి సోన్‌ నది తీరాన తీవ్ర గాయాలతో అనుమానాస్పదంగా ఉన్న శవాన్ని గుర్తించారు. అనంతరం అతని కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో అతన్ని పంకజ్‌గా నిర్థారించారు. అయితే గత కొంత కాలంగా అతను ఇసుక మాఫియాపై ఉద్యమం చే​స్తున్నాడని, దానికి సంబంధించిన వారే పంకజ్‌ను దారుణంగా హత్య చేసి ఉంటారని కుటుంబ సభభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గతంలోనూ ఇసుక మాఫీయాకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలూ చేపట్టినట్టు తెలిపారు. కాగా అతని శరీరంపై పెద్ద ఎత్తున గాయాలు ఉండటంతో పోస్ట్‌మార్ట్‌ నిర్వహించి వివరాలను సేకరించారు. అనంతరం కేసును వివిధ కోణాల్లో దర్యాప్తు చేపడతామని పోలీసు అధికారి అశోక్‌ మిశ్రా తెలిపారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు