ఇసుక దొంగకు మూడేళ్ల జైలు శిక్ష

23 Nov, 2019 04:41 IST|Sakshi

రూ.10 వేల జరిమానా

కడప కోర్టు తీర్పు 

సాక్షి, అమరావతి: ఇసుక దొంగతనం కేసులో ఓ వ్యక్తికి కడప కోర్టు మూడేళ్ల జైలు శిక్ష, రూ.5 వేల జరిమానా విధించింది. ప్రజల ఆస్తికి నష్టం కలిగించినందుకు ప్రజా ఆస్తి విధ్వంస నిరోధక చట్టం (పీఓపీపీడీ) కింద ఏడాది జైలు శిక్ష, రూ.5 వేల జరిమానా కూడా విధించింది. ఈ రెండు శిక్షలను ఏకకాలంలో అనుభవించాలని కోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు కడప జిల్లా రెండో అదనపు జ్యుడీషియల్‌ ఫస్ట్‌ క్లాస్‌ మేజిస్ట్రేట్‌ పి.భానుసాయి రెండు రోజుల క్రితం తీర్పు వెలువరించారు.

ఇసుకను అక్రమంగా నిల్వ చేసినా, అక్రమంగా రవాణా చేసినా, బ్లాక్‌ మార్కెట్‌లో విక్రయించినా, ఒకరి పేరిట కొని, మరొకరికి అమ్మినా రెండేళ్ల జైలు, రూ.2 లక్షల జరిమానా విధించేలా చట్ట సవరణ చేసేందుకు ఈ నెల 13న  రాష్ట్ర మంత్రి మండలి తీర్మానం చేసిన కొద్ది రోజులకే ఈ తీర్పు వెలువడటం విశేషం. 

పాపాగ్నిలో అక్రమంగా ఇసుక తవ్వకం 
వైఎస్సార్‌ కడప జిల్లా పెండ్లిమర్రి మండలం గోపరాజుపల్లికి చెందిన నంద్యాల సుబ్బారాయుడు పాపాగ్ని నదిలో ఇసుకను దొంగిలిస్తున్నారంటూ ఈ ఏడాది జూలై 15న పెండ్లిమర్రి పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో పోలీసులు సుబ్బారాయుడు ఇసుక తవ్వుతున్న ప్రాంతానికి వెళ్లారు. అక్కడ ట్రాక్టర్‌లో ఇసుకను లోడ్‌ చేస్తూ సుబ్బారాయుడు కనిపించాడు. అతడని పోలీసులు పట్టుకొని విచారణ చేశారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ప్రియుడితో కలసి సోదరి హత్య

ఇంటి పట్టున ఉండలేక.. ఆత్మహత్యాయత్నాలు

స్నేహితుడు లేని లోకంలో ఉండలేక..

కొడుకు ఆత్మహత్య.. వెళ్లలేని స్థితిలో తల్లిదండ్రులు

రిమ్స్ వైద్యుడిపై పోలీసులకు ఫిర్యాదు

సినిమా

ఈ రోజు నాకు ఎంతో ప్రత్యేకం: చిరంజీవి

రియల్‌ 'హీరో'ల్‌

నిఖిల్‌ పెళ్లి ఈ నెల 17నే

పెద్దాయన సన్‌ గ్లాసెస్‌ వెతకండ్రా

రూ.1.25 కోట్ల విరాళం ప్ర‌క‌టించిన అజిత్‌

టిక్‌టాక్ వీడియోపై ర‌ష్మి ఆగ్ర‌హం