భర్త కిడ్నాప్‌.. భార్య హత్య

6 Dec, 2019 11:30 IST|Sakshi
శాంతి ప్రియ(ఫైల్‌) పోలీసులు అరెస్ట్‌ చేసిన ఇళయరాజా, కృష్ణమూర్తి, పయని

వానియంబాడిలో ఘటన ఎర్రచందనం కూలీల ఘర్షణ

ఏడుగురు అరెస్ట్‌

వేలూరు: వానియంబాడిలో ఎర్రచందనం తీసుకెళ్లడంతో కూలీ డబ్బులు ఇవ్వనందుకు ఘర్షణ ఏర్పడడంతో భర్తను కిడ్నాప్‌ చేసి భార్యను హత్య చేసిన నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. వానియంబాడి సమీపంలోని ఆలంగాయం పూంగానత్తం గ్రామానికి చెందిన శ్రీనివాసన్‌ భార్య శాంతిప్రియలకు ఏడేళ్ల క్రితం వివాహం జరిగింది. శ్రీనివాసన్‌కు ఒడుగత్తూరుకు చెందిన అశోక్‌తో పరిచయం ఏర్పడడంతో ఎర్రచందనం నరికేందుకు కూలీకి వెల్లేవాడు. కొద్ది రోజుల క్రితం శ్రీనివాశన్‌ పూంగానత్తం నుంచి కృష్ణమూర్తి, పయణి, ఇళయరాజ, చిన్నరాయన్, సంజయ్, వెంకటేశన్‌ కలిసి కూలీ పనుల కోసం అశోకన్‌తో పంపాడు. వీరందరిని అశోకన్‌ ఆంధ్ర రాష్ట్ర్‌రంకు ఎర్రచందనం నరికేందుకు తీసుకెళ్లాడు.

అడవిలో నరికిన ఎర్రచందనాన్ని తమిళనాడుకు తీసుకొచ్చి విక్రయించిన వెంటనే కూలీ డబ్బులు ఇస్తామని తెలిపి ఏడుగురిని పూంగానత్తం గ్రామానికి పంపి వేశారు. అయితే కూలీ పనులకు వెళ్లి వచ్చి పది రోజులు అవుతున్నా వీరికి కూలి డబ్బులు ఇవ్వలేదు. వీరు ఏడుగురు శ్రీనివాసన్‌ వద్ద కూలి డబ్బులు తీసి ఇవ్వాలని తెలిపారు. అయితే శ్రీనివాసన్‌ ఏజెంట్‌ అశోకన్‌ వద్ద నగదు తీసుకొని తమకు ఇవ్వలేదని ఆరోపిస్తూ ఏడుగురు బుధవారం రాత్రి శ్రీనివాసన్‌ ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో శ్రీనివాసన్‌కు, ఏడుగురు కూలీలకు వాగ్వివాదం ఏర్పడింది. దీంతో వారు ఏడుగురు కలిసి శ్రీనివాసన్‌ను కారులో కిడ్నాప్‌ చేసుకొని తీసుకెళ్లారు. ఆ సమయంలో అడ్డుకునేందుకు వచ్చిన శ్రీనివాసన్‌ భార్య శాంతిప్రియ, తల్లిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. వెంటనే శాంతిప్రియను గ్రామస్తులు వానియంబాడి ఆసుపత్రిలో చేర్పించారు. అయితే చికిత్స పొందుతూ శాంతిప్రియ మృతి చెందింది. విషయం తెలుసుకున్న ఆలంగాయం పోలీసులు శాంత ప్రియను హత్య చేసి భర్తను కిడ్నాప్‌ చేసిన ఏడుగురిని అరెస్ట్‌ చేసి విచారణ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు