ఫేస్‌బుక్‌ ప్రేమతో తంటా

29 Aug, 2019 09:02 IST|Sakshi

విమానమెక్కి భోపాల్‌ వెళ్లిన బెంగళూరు బాలిక  

పోలీసుల కౌన్సెలింగ్‌  

క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగింత

కర్ణాటక, యశవంతపుర: సోషల్‌ మీడియా ప్రేమలు ముక్కుపచ్చలారని బాలలను ఎలా తప్పుదారి పట్టిస్తున్నాయో మరోసారి వెల్లడైంది. సిలికాన్‌ సిటిలో 10వ తరగతి బాలిక ఒకరు ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయమైన స్నేహితున్ని వెతుకుతూ విమానం ఎక్కి రాష్ట్రాలు దాటి వెళ్లింది.  అతడు కూడా మైనర్‌ దాటని బాలుడే కావడం గమనార్హం. చివరకు శిశు సంక్షేమ అధికారులు, పోలీసులు బాలికకు నచ్చజెప్పి బెంగళూరుకు తీసుకురావడంతో సుఖాంతమైంది. 

ఏం జరిగిందంటే  
వివరాలు.. బెంగళూరులో ఓ ధనవంతుని కుమార్తె కార్పొరేట్‌ పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. స్మార్ట్‌ఫోన్, కంప్యూటర్‌లో తరచూ సోషల్‌మీడియాలో చురుగ్గా ఉండేది. ఈ తరుణంలో మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌కు చెందిన ఒక కుర్రవానితో ఫేస్‌బుక్‌లో పరిచయం కుదిరింది. ఇద్దరూ ఫోన్‌ నంబర్లు తీసకుని తరచూ మాట్లాడేవారు. ప్రేమలో పడినట్లు కూడా సమాచారం. ఈ వ్యవహారం తల్లిదండ్రులకు తెలియటంతో బాలికను మందలించారు. ఒకవైపు తల్లిదండ్రు లు ఆగ్రహించడం, మరోవైపు ప్రియున్ని కలవాలన్న భావనలో ఆ బాలిక బెంగళూరు విమానశ్రయం నుండి విమానంలో భోపాల్‌కు వెళ్లిపోయింది. భోపాల్‌లోని ప్రేమికుని ఇంకి వెళ్లింది. ఇంట్లో వారు చూస్తే గొడవ అవుతుందని ఆ అబ్బాయి బాలికను ఒక హోటల్‌కు తీసుకెళ్లాడు. ఇంతదూరం ఎందుకు వచ్చావంటూ బుద్ధిమాటలు చెప్పి బెంగళూరుకు వెళ్లాలని సూచించాడు. ఇందుకు బాలిక ససేమిరా అంది. తాను ఇక్కడే ఉంటానని బాలిక మారాం చేయడంతో ఇద్దరి మధ్య గలాటా జరిగింది. 

బాలికకు కౌన్సెలింగ్‌  
ఇంతలో బాలిక మిస్సయిన సంగతి తెలిసి ఆమె తల్లిదండ్రులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడం, వారు విచారణజరిపి భోపాల్‌లో ఉన్నట్లు గుర్తించడం జరిగింది. అక్కడి పోలీసులను అప్రమత్తం చేశారు. దీంతో పోలీసులు గాలించి మైనర్‌ ప్రేమజంటను  పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. బాలల సంరక్షణ సమితి ఆ బాలికకు కౌన్సెలింగ్‌ నిర్వహించారు. ఫేస్‌బుక్‌ స్నేహితున్ని కలవడానికి  వచ్చినట్లునామె తెలిపింది. తండ్రితో గొడవపడిన బాలిక కొద్దిరోజుల పాటు కాల్‌ సెంటర్‌లో పని చేసి వచ్చిన డబ్బులతో భోపాల్‌కు వెళ్లినట్లు తెలిసింది. మంగళవారం రాత్రి బాలికను క్షేమంగా బెంగళూరుకు తీసుకొచ్చారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఒంటికి నిప్పంటించుకుని..విలవిల్లాడుతూ..

అ‘మాయ’కుడు.. ‘మంత్రులే టార్గెట్‌’

కార్మిక శాఖలో వసూల్‌ రాజా

కానిస్టేబుల్‌ దంపతులపై దుండగుల దాడి 

ప్రియుడితో ఏకాంతంగా ఉండటం భర్త చూడటంతో..

మద్యం మత్తులో మర్మాంగాన్ని కొరికేశాడు

సీఎంను దూషించిన కేసులో ఐదుగురి అరెస్ట్‌

చిన్నారులను చిదిమేశారు ! 

కూతురు ఫోన్‌లో అశ్లీల వీడియో.. తండ్రిపై లైంగిక కేసు

ఫోటో షూట్‌ పేరుతో ఇంటికి పిలిచి..

విశాఖలో రెచ్చిపోయిన ప్రేమోన్మాది

బిహార్‌లో దారుణం.. 16 మందిపై యాసిడ్‌ దాడి

దారుణం : నార్మల్‌ డెలివరీ చేస్తుండగా..

తెగబడ్డ దొంగలు, పరిగెత్తిన మహిళ

విశాఖలో భారీగా గంజాయి పట్టివేత

కడప పీడీజేకు ఫోన్‌ చేసి.. దొరికిపోయాడు!

డ్రగ్స్‌కు బానిసైన కుమార్తెను..

సోమిరెడ్డిపై ఫోర్జరీ కేసు నమోదు

45ఏళ్లకు ప్రెగ్నెన్సీ.. స్వయంగా అబార్షన్‌.. విషాదం

ఒంటరి మహిళలే టార్గెట్‌

కన్న కూతురి హత్యకు తల్లి యత్నం

జల్సాల కోసం చోరీల బాట

చెక్కు పంపిస్తానని చెక్కేశాడు..

రూ. 10 లక్షల రుణం కోసం రూ.11లక్షలు వసూలు

భూమి కోసం ఘర్షణ

యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం

కన్న కూతురిపై తండ్రి అఘాయిత్యం

అయ్యో..పాపం పసికందు..!    

పోలీసు శాఖలో.. 'మెమో' కలకలం

ఆత్మహత్యలకు కేరాఫ్‌గా.. రైల్వేట్రాక్స్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బోలెడన్ని గెటప్పులు

అక్షరాలు తింటాం.. పుస్తకాలు కప్పుకుంటాం

ఆసియాలో అతి పెద్ద స్క్రీన్‌

నలుగురు దర్శకులు.. నెట్‌ఫ్లిక్స్‌ కథలు

శర్వా ఎక్స్‌ప్రెస్‌

ఆనందం.. విరాళం