టీచర్‌పై సామూహిక అత్యాచారం

8 Dec, 2019 04:37 IST|Sakshi

సిధి/దమోహ్‌/మోవ్‌: మధ్యప్రదేశ్‌లో ఓ పాఠశాల ఉపాధ్యాయురాలిపై సామూహిక అత్యాచారం జరగగా, మరో చోట వేధింపులు తాళలేక ఓ టీనేజర్‌ ఆత్మహత్య చేసుకుంది. రెండు ఘటనలు గురువారం జరగ్గా ఆలస్యంగా వెలుగులో కొచ్చాయి. సిధిలో సాయంత్రం స్కూల్‌ ముగించుకొని తిరిగి వస్తున్న టీచర్‌పై నలుగురు స్థానికులు దగ్గర్లోని ఓ ఫాంహౌజ్‌కు ఎత్తుకెళ్లి గ్యాంగ్‌రేప్‌ చేశారు. ఆమె స్పృహతప్పి పడిపోవడంతో అక్కడి నుంచి పారిపోయారు.

అనంతరం ఆమె ఇంటికెళ్లి వివరాలను తెలపడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరిపై గతంలోనూ పలు కేసులు నమోదయ్యాయి.  మరోవైపు, దమోహ్‌లో 17 ఏళ్ల బాలిక గురువారం చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. స్థానిక యువకులు కొందరు ఆమెను వేధింపులకు గురి చేయడంతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు