ఆలయం ముందు మహిళలపై వీరంగం

18 Jun, 2018 09:22 IST|Sakshi

ఉజ్జయినీ : ఆలయం ముందు పూల వ్యాపారుల మధ్య నడిరోడ్డు మీద గొడవ జరిగింది. ఆలయం ముందు అందరూ చూస్తుండగానే ఓ వ్యక్తి మహిళలపై దారుణంగా దాడి చేశాడు. ప్రత్యర్థి వ్యక్తిని కిందపడేసి కొట్టడమే కాదు.. అతనికి అండగా వచ్చిన మహిళలపైనా విచక్షణారహితంగా దాడి చేశాడు. మధ్యప్రదేశ్‌ ఆధ్యాత్మిక నగరం ఉజ్జయినిలోని ‘మహంకాళి’ ఆలయం వద్ద ఈ ఘటన జరిగింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. పూల వ్యాపారుల మధ్య గొడవ ఎందుకు జరిగింది? వారి వివరాలు తెలియాల్సి ఉంది. ఆలయం ముందు జరిగిన ఈ కొట్లాటకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది.

ఈ వీడియోలో అర్ధనగ్నంగా ఉన్న ఓ యువకుడు వీరంగం వేశాడు. ప్రత్యర్థి యువకుడిని కిందపడేసి చితకబాదడమే కాదు.. మహిళలని చూడకుండా కిరాతకంగా దాడి చేశాడు. మహిళలను కర్రతో చితకబాదడమే కాకుండా.. వారిపై ఎగిరిదూకి సినిమా తరహాలో స్టంట్‌లు చూశాడు. డబ్ల్యూడబ్ల్యూఎఫ్‌ ప్రభావం ఆ యువకుడిపై కనిపిస్తోందని, మహిళలను కిరాతకంగా కొడుతున్నా.. చుట్టూ ఉన్నవారు వినోదం చూస్తున్నారే తప్ప.. ఎవరూ ఎందుకు స్పందించలేదని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా