36 గంటలు డ్యూటీ చేసి...

14 Jun, 2018 15:06 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

చండీగఢ్‌ : ఫరీదాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. 36 గంటల పాటు నిరంతరాయంగా పని చేయడం వల్ల ఓ సెక్యూరిటీ గార్డు మరణించాడు. వివరాల్లోకి వెళ్తే.. హరీశ్‌ చందర్‌ అనే వ్యక్తి గత 25 ఏళ్లుగా ఓ ప్రముఖ సెక్యూరిటీ కంపెనీ తరపున వివిధ కంపెనీల్లో పనిచేస్తున్నాడు. ప్రస్తుతం ఫరీదాబాద్‌లోని సెక్టార్‌ 59లో గల ఎస్‌టీఎల్‌ కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వర్తిస్తున్నాడు.

బుధవారం ఉదయం షిఫ్టు మారాల్సి ఉండగా వేరొక గార్డు రాకపోవడంతో హరీశ్‌ చందర్‌ డ్యూటీలోనే ఉండాల్సి వచ్చింది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటం, తాగటానికి మంచి నీళ్లు కూడా అందుబాటులో లేకపోవడంతో అతడు స్పృహ తప్పి పడిపోయాడు. విషయాన్ని గమనించిన స్థానికులు ఆస్పత్రిలో చేర్పించగా అప్పటికే అతడు మరణించినట్లు వైద్యులు నిర్దారించారు. వేడిమి అధికంగా ఉండడం, నిరంతరాయంగా పనిచేయడం వల్ల అలసటతో హరీశ్‌ మరణించినట్లు పోస్ట్‌మార్టమ్‌ నివేదికలో వెల్లడైందని పోలీసులు తెలిపారు.

మరిన్ని వార్తలు