పాఠశాలపై దేశద్రోహం కేసు

28 Jan, 2020 19:27 IST|Sakshi
సీఏఏ వ్యతిరేక ఆందోళన (పైల్‌ ఫోటో)

సాక్షి, బీదర్‌: కర్నాటకలోని బీదర్‌లో ఒక విచిత్రమైన కేసు నమోదైంది.  పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)కి వ్యతిరేకంగా వ్యవహరించారన్న ఆరోపణలతో ఒక పాఠశాలపై దేశద్రోహం కేసునమోదైంది.  భారతీయ శిక్షాస్మృతిలోని 124 (ఎ), 153 (ఎ) సెక్షన్ల క్రింద "వివిధ సమూహాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించడం" అనే ఆరోపణల నేపథ్యంలో కోసం షాహీన్ పాఠశాల యాజమాన్యంపై కూడా కేసులు నమోదయ్యాయి. జనవరి 26 న సామాజిక కార్యకర్త నీలేష్ రక్షాల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. జనవరి 21న పాఠశాల అధికారులు విద్యార్థులను నాటకం ప్రదర్శించడానికి 'ఉపయోగించారని' ఫిర్యాదుదారుడు ఆరోపించారు.

పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ),  పౌరుల జాతీయ రిజిస్టర్ (ఎన్‌ఆర్‌సీ)ని తీసుకొచ్చిన ప్రధానమంత్రి నరేంద్రీ మోదీని స్కూలు యాజమాన్యం అవమానించిందనేది ప్రధాన ఆరోపణ. విద్యార్థులను అడ్డం పెట్టుకుని, వారు ప్రదర్శించిన నాటకం ద్వారా ప్రధాని మోదీని దుర్భాషలాడారని నీలేష్ ఆరోపించారు. అయితే ఇంతవరకు ఎవరినీ అరెస్టు చేయలేదని పోలీసులు తెలిపారు. దీంతో నరేంద్రమోదీకి, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కావాలనే విద్యార్థులను నాటకం ప్రదర్శించడానికి అనుమతించారనే ఆరోపణలతో  దేశద్రోహ కేసు నమోదైంది.

బీదర్ నగరంలోని షాహీన్ పాఠశాల వార్షికోత్సవం సందర్భంగా, పాఠశాల విద్యార్థులు సీఏఏ, ఎన్‌ఆర్‌సీకి వ్యతిరేకంగా చిన్న నాటకాన్ని ప్రదర్శించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది.  ఎవరైనా మీ వద్దకు వచ్చి పత్రాల గురించి అడిగితే  చెప్పులతో కొట్టండన్న డైలాగులు వివాదాన్ని సృష్టించాయి

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు