శిక్ష తగ్గించాలని ఆశారాం బాపూ వేడుకోలు..

11 Sep, 2018 15:14 IST|Sakshi

జైపూర్‌ : బాలికపై లైంగిక దాడి కేసులో దోషిగా జీవిత ఖైదు అనుభవిస్తున్న వివాదాస్పద ఆథ్యాత్మిక గురువు ఆశారాం బాపూ రాజస్థాన్‌ గవర్నర్‌కు క్షమాభిక్ష ప్రసాదించాలని లేఖ రాశారు. ఐదేళ్ల కిందట తన ఆశ్రమంలో మైనర్‌ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో జోథ్‌పూర్‌ కోర్టు ఈ ఏడాది ఏప్రిల్‌ 25న ఆశారాంను దోషిగా నిర్ధారిస్తూ జీవిత ఖైదు విధించింది. కోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ జులై 2న ఆశారాం హైకోర్టును ఆశ్రయించగా, పిటిషన్‌ను కోర్టు ఇంకా విచారణకు స్వీకరించలేదు.

వయోభారంతో ఇబ్బందిపడుతున్న తనకు జీవిత ఖైదు తీవ్రమైన శిక్ష అంటూ శిక్ష తీవ్రతను తగ్గించాలని క్షమాభిక్ష లేఖలో ఆశారాం గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు. మరోవైపు ఆశారాం దరఖాస్తుపై సవివర నివేదిక పంపాలని గవర్నర్‌ హోంశాఖకు పంపారు. దీనిపై జిల్లా అధికారులు, పోలీసుల నుంచి నివేదిక కోరామని జోథ్‌పూర్‌ సెంట్రల్‌ జైల్‌ సూపరింటెండెంట్‌ జై కైలాష్‌ త్రివేది చెప్పారు. నివేదిక రాగానే రాజస్థాన్‌ డీజీ (జైళ్లు)కు పంపుతామని జైలు అధికారులు తెలిపారు. కాగా 2013 ఆగస్ట్‌ 15 రాత్రి తనపై ఆశారాం బాపూ తన ఆశ్రమంలో లైంగిక దాడికి పాల్పడాడ్డరని 16 సంవత్సరాల బాలిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.

>
మరిన్ని వార్తలు