బీసీ హాస్టల్లో జూనియర్లపై సీనియర్ల దాడి

19 Aug, 2018 14:57 IST|Sakshi

నిజామాబాద్‌ :  తమ బట్టలు ఉతకాలంటూ సెకండియర్‌ విద్యార్థులు, జూనియర్‌ విద్యార్థులపై దాడి చేసిన సంఘటన నిజామాబాద్‌ బీసీ హాస్టల్లో చోటుచేసుకుంది. సీనియర్‌ విద్యార్థుల వేధింపులు తట్టుకోలేక నిజామాబాద్‌ 3వ టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో జూనియర్‌ విద్యార్థులు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. సీనియర్ల వేధింపులు ఎక్కువై ఐదుగురు విద్యార్థులు కూడా హాస్టల్‌ వదిలి వెళ్లేందుకు ప్రయత్నించినట్లు తెలిసింది. బీసీ హాస్టల్‌ వార్డెన్‌ నిర్లక్ష్యం వల్లనే సీనియర్‌ విద్యార్థులు ర్యాగింగ్‌ చేస్తున్నారని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపణలు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు