సీరియల్‌ ఆర్టిస్ట్‌ గుట్టురట్టు!

9 Dec, 2019 20:52 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, హైదరాబాద్‌: అతనో సీరియల్‌ ఆర్టిస్టు. ఒకవైపు సీరియళ్లలో నటిస్తూ.. ఇంకోవైపు తాళాలు వేసిన ఇళ్లు కనబడితే చాలు పగటిపూటే అక్కడ వాలిపోతాడు. తాళాలు పగులగొట్టి దొంగతనాలకు పాల్పడుతుంటాడు. దొంగతనాలతో వచ్చిన సొమ్మును సీరియల్స్‌ తీసి.. అందులో నటించడం ఇతగాడి హాబి. ఈ ‘దొంగ’  ఆర్టిస్ట్‌ గుట్టు తాజాగా రట్టయింది. కూకట్‌పల్లి పరిధిలో పగటిపూట ఇళ్ల తాళాలు పగలగొట్టి దొంగతనాలకు పాల్పడుతున్న సీరియల్‌ ఆర్టిస్ట్‌ విక్కీ రాజాను పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి 30 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. గతంలో కూడా పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో ఇతడు దొంగతనాలకు పాల్పడ్డాడని, చోరీ సోమ్ముతో సీరియళ్లలో నటించడం ఇతని అలవాటు అని కూకట్‌పల్లి పోలీసులు తెలిపారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు