హడలెత్తిస్తున్న వరుస హత్యలు

25 Apr, 2019 13:51 IST|Sakshi
ఫ్రూట్స్‌ మండీల సమీపంలో హతమైన హాషమ్‌ బేగ్‌

డబ్బు కోసమే హత్యలు చేశారా?

రూ. 5 లక్షలతో పోలీసులకు కనిపించిన వారెవరు?

ప్రాణం తీసిన వివాహేతర సంబంధం

హంతకుల కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు

నాలుగు రోజుల వ్యవధిలో వరుసగారెండు దారుణ హత్యలు జరిగిన సంఘటనలతో రాయచోటి పట్టణ ప్రజలు హడలిపోతున్నారు.  ఈ హత్యలు చేసిన విధానందారుణంగా ఉండటంతో భయభ్రాంతులకులోనవుతున్నారు. ఒకటేమో..ఫ్రూట్స్‌ మండీలకు అతి సమీపంలో  హత్య జరగ్గా...మరొక్కటి పట్టణానికి సమీపంలోనిరాయుడు కాలనీలో రాత్రి 8–30 గంటలమధ్య అందరూ నిద్రపోకముందే
అత్యంత  కిరాతంగా హత్య జరిగింది.పట్టణంలో ఇప్పడు ఎక్కడ చూసినా ఈసంఘటనలపై చర్చించుకొంటున్నారు.

వైఎస్‌ఆర్‌ జిల్లా, రాయచోటి టౌన్‌ : పట్టణంలో ఇటీవల వరుస హత్యలు జరగడంతో ప్రజలు భయభాంత్రులకు గురవుతున్నారు. ఫ్రూట్స్‌ మండీల వద్ద ఒక హత్య, రాయుడు కాలనీలో మరో హత్య జరిగింది. హంతకుల కోసం   పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఫ్రూట్స్‌ మండీల వద్ద హత్య జరిగిన రోజు రాత్రి ఒక మహిళ, యువకుడు, మరో వ్యక్తి ముగ్గరు బీట్‌ చేస్తున్న పోలీసులకు తటస్థపడ్డారు. ఏదో అనుమానంతో వారిని విచారించగా వారి వద్ద రూ.5లక్షలు నగదు కూడా ఉన్నట్లు వెలుగు చూసినట్లు పోలీసుల విచారణలో బయట పడినట్లుగా సమాచారం.

ఆ ముగ్గురే హంతకులా..?
ఇదే విషయం పట్టణంలో చర్చించుకోవడం మరో విశేషం. వారిని బీట్‌ చేస్తున్న పోలీసుల స్టేషన్‌కు తీసుకెళ్లి విచారించగా తాము దుస్తుల వ్యాపారం కోసం వచ్చామని దుకాణాలకు దుస్తులు వేయగా ఈ డబ్బులు వచ్చాయని,  తిరిగి తమ ఊర్లకు వెళ్లుతున్నామని ముగ్గరు మూకుమ్మడిగా పోలీసులను నమ్మపలికించారట. వారు చెప్పిన మాటలలో ఎక్కడా అనుమానం లేకపోవడంతో పోలీసులు కూడా వారిని వదిలిపెట్టినట్లు వాదనలు వినిపిస్తున్నాయి. మరుసటి రోజు తెల్లవారుజామునే ఆ ఇంటిలో హత్య జరిగినట్లుగా ఎవరూ గుర్తించకపోవడం వారికి కలిసొచ్చిన విషయంగా చెప్పుకొంటున్నారు. స్థానికులు, పోలీసులు మరేఇతరా వ్యక్తులు ఆ హత్య  జరిగినుట్లు గుర్తించినా వారికి వారే నేరుగా పోలీసుల చేతికే చిక్కినట్లే చిక్కి వదిలించుకపోయారని చర్చించుకొంటున్నారు. అయితే ముందుగా పథకం ప్రకారం ఒక యువకుడు ముందుగా ఆ ఇంటిలోకి వెళ్లి అతడితో కలసి ఉండటం..తరువాత కాస్త పొద్దు పోయా మిగిలిన వ్యక్తి ఆ మహిళ ఇద్దరు వెళ్లడం పథకం ప్రకారం (హషమ్‌ బేగ్‌)ను హతమొందించినట్లు కూడా చర్చించుకొంటున్నారు. మృతదేహాన్ని కనుగొన్న తరువాత ఎన్ని రోజుల క్రితం జరిగిందనే విషయాలు...ఎక్కడ జరిగింది. ఇలాంటి విషయాలు పోలీసులు పూర్తిగా విచారణ చేపట్టే క్రమంలో వారికి అనుమానాలు వ్యక్తం అయినట్లుగా..ఆ రోజు అనుమానితులుగా భావించిన వ్యక్తులు ముగ్గురు వ్యక్తులు వారేననే నిర్ధారణకు వచ్చినట్లుగా  కూడా మాట్లాడుకొంటున్నారు. అయితే వారు ప్రస్తుతం ఎక్కడున్నారో ఎలా పట్టుకోవాలోనని పోలీసులు ముల్లుగుల్లాలు పడుతున్నారు.

శంకర్‌రెడ్డి హత్యపై వీడని అనుమానాలు
రాయుడు కాలనీలో హత్యకు గురియిన శంకర్‌రెడ్డి హత్య కేసులో  కూడా పలు అనుమానాలు రేకిస్తున్నారు. ఆ రోజు శంకర్‌రెడ్డిని హత్య చేసిన వారిలో తల్లి కొడుకులేనా..? ఇంకా ఎవరైనా ఉన్నారా అనేది తెలియాల్సి ఉంది. అక్కడ ఉపయోగించిన మారణాయుధాలు చేస్తే ఒకరిద్దరు చేసిన హత్య కాదనిపిస్తోంది. దీనిపై పట్టణంలో సర్వత్రా చర్చలు జరుగుతున్నాయి. అయితే ఆ ఇద్దరితో పాటు మరో ఇద్దరిని కూడా పోలీసులు విచారణ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
ఆ నలుగురు వ్యక్తులే కాకుండా మరి కొంతమంది యువకులు కూడా హత్యలో పాలుపంచుకొని ఉంటారని చర్చించుకొంటున్నారు. నాలుగు రోజుల వ్యవధిలో రెండు హత్యలు చోటు చేసుకోవడం పోలీసులకు ఊపిరి పీల్చుకోవడానికి కూడా తీరక లేకుండా చేస్తోంది. ఎక్కడ ఏ ఒకరిని విడిచిపెట్టినా...ఎలాంటి నిందలు వస్తాయోనని పోలీసులు ఆందోళనలో  ఉన్నట్లు తెలుస్తోంది. హంతకుల కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు.

మరిన్ని వార్తలు