దట్టమైన పొగమంచు.. ఏడుగురు దుర్మరణం

29 Dec, 2018 13:46 IST|Sakshi

చంఢీగడ్‌: రహదారిని కమ్మెసిన దట్టమైన పొగమంచు ఏడుగురిని బలితీసుకుంది. అంబలా, చంఢీగడ్‌ జాతీయ రహదారిపై శనివారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మరణించగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. పొగమంచు జాతీయ రహదారిని కమ్మివేయడంతో ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించక ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు ఢీకొని మరో వాహనంపైకి దూసుకుపోయ్యాయి. మృతులంతా చంఢీగడ్‌కు చెందిన వారిగా గుర్తించారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు స్థానికులు తెలిపారు.

కాగా పొగమంచు కారణంగా సోమవారం ఛండీగడ్‌లోనే జరిగిన ప్రమాదంలో ఎనిమిది మంది మృతిచెందిన విషయం తెలిసిందే. గత వారం రోజులుగా ఉత్తర భారతాన్ని పొగమంచు ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మంచు కారణంగా ఎదురుగావచ్చే వాహనాలు కనిపించక ప్రమాదాలు చేసుకుంటున్నాయి.

మరిన్ని వార్తలు