యూరియా కలిసిన నీరుతాగి  గొర్రెలు మృతి

21 Mar, 2018 16:25 IST|Sakshi
మృతిచెందిన గొర్రెలు

నస్పూర్‌(మంచిర్యాల): నస్పూర్‌ మండలం తీగల్‌పహాడ్‌ పంచాయతీ పరిధిలోని సంఘంమల్లయ్య పల్లెకు చెందిన పొనవేణి గట్టయ్యకు చెందిన 16 సబ్సిడీ గొర్రెలు మంగళవారం మృతి చెందాయి. ఎఫ్‌సీఐ గోదాముల వద్ద యూరియా కలిసిన నీటిని గొర్రెలు తాగడంతో తీవ్ర అస్వస్థతకు గురై మృతిచెందినట్లు బాధితుడు తెలిపాడు. గోదాముల్లో కింద పడిన యూరియాను పారవేయకుండా నీరుపోసి శుభ్రం చేయడంతో ఆ నీరు బయటకు వచ్చి నిలిచి ఉండడంతో గొర్రెలు తాగి చనిపోయాయని పేర్కొన్నాడు.


గొర్రెలను మండల సహాయ పశు వైద్యురాలు పద్మ పరిశీలించారు. పరిహారం అందించి ఆదుకోవాలని బాధితుడు ప్రభుత్వాన్ని కోరాడు. మంగళవారం సాయత్రం మంచిర్యాల పశు వైద్యాధికారి ఎం.భూమయ్య, వైద్యులు సిద్దు పవార్, సంతోష్, పద్మలు గ్రామంలోని మిగతా గొర్రెలకు చికిత్స అందించారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు