బొమ్మల షాపులో మహిళపై దారుణం

3 Jul, 2020 17:02 IST|Sakshi

ముంబై : షాపులో బొమ్మలు కొందామని వచ్చిన మహిళను దారుణంగా చంపడమే గాక అత్యాచారం చేసిన ఘటన మహారాష్ట్రలోని నలాసోపారాలో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాలు.. 32 ఏళ్ల మహిళ తన భర్త, పిల్లలతో కలిసి నలాసోపారాలో నివసిస్తుంది. ఆమె భర్త పాల వ్యాపారం నిర్వహిస్తున్నాడు. కాగా జూన్‌ 26న పిల్లలకు బొమ్మలు కొందామని వెళ్లిన సదరు మహిళ తిరిగిరాలేదు. దీంతో ఆమె భర్త తులింగ్‌ పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు వివరాలు సేకరించి మిస్సింగ్‌ కేసుగా నమోదు చేశారు.( పరారీలో టీడీపీ నేత కొల్లు రవీంద్ర!)

అయితే జూన్‌ 28న నలాపోపారాలోని చందన్‌నకా రోడ్‌ వెంబడి పార్క్‌ చేసి ఉన్న కారులో అనుమానాస్పద స్థితిలో ఒక మహిళ మృతదేహం కుళ్లిపోయి దుర్వాసన వస్తోందని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. తన భార్య కనిపించడం లేదని మిస్సింగ్‌ కేసు నమోదు చేసిన మహిళ భర్తను వెంటబెట్టుకొని పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఆ వ్యక్తి మృతదేహాన్ని పరిశీలించి చూడగా ఆ మృతదేహం తన భార్యదేనని పేర్కొన్నాడు. కాగా మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించగా సదరు మహిళ హత్యకు గురవ్వడమే గాక అత్యాచారం చేయబడిందని రిపోర్టులో తేలింది. దీంతో కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు పాల్గర్‌ సీడీఐ సహాయంతో విచారణ ప్రారంభించారు. గత కొన్ని రోజులుగా ఆ వాహనం అక్కడే పార్క్‌ చేసి ఉంటుందని అక్కడి స్థానికులు విచారణలో పేర్కొన్నారు. పక్కనే ఉన్న సీసీటీవీ ఫుటేజీ సహాయంతో అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి.(రోజు కూలీపై ఆస్పత్రి యాజమాన్యం దాడి)

జూన్‌ 26 న ఆ వ్యాన్‌ పార్క్‌ చేసిన ప్రదేశంలో పక్కనే ఉన్న ఒక టాల్‌స్టాయ్‌ షాపుకు మహిళ వెళ్లినట్లు సీసీటీవీలో కనిపించింది. ఆ తర్వాత ఆమె ఆచూకి లభించకపోవడంతో పోలీసుల అనుమానం బలపడి షాపు యజమానిని అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించారు. దీంతో షాపు యజమాని ఆ మహిళను హత్య చేసింది తానేనని ఒప్పుకున్నాడు.' జూన్‌ 26న సదరు మహిళ తన షాపుకు వచ్చింది. బొమ్మలు కొనే విషయంలో వాగ్వాదం తలెత్తడంతో క్షణికావేశంతో ఆమె జుట్టు పట్టుకొని గదిలోకి ఈడ్చుకుపోయి మెడమీద చేతులు పెట్టి చంపేశాను. అనంతరం ఆమెను శారీరకంగా అనుభవించాను. ఒక రాత్రంతా మహిళ శవంతోనే గడిపి తర్వాత ఆమె మృతదేహాన్ని ప్లాస్టిక్‌ కవర్‌లో చుట్టి పక్కనే పార్క్‌ చేసి ఉన్న వాహనంలోకి విసిరేసి అక్కడి నుంచి వెళ్లిపోయాను.' అంటూ పేర్కొన్నాడు. కాగా నిందితునిపై లైంగిక దాడి కేసుతో పాటు మర్డర్‌ కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు