కాలి బూడిదైన కోల్డ్‌స్టోరేజీ

19 Jun, 2019 08:02 IST|Sakshi
కోల్డ్‌ స్టోరేజీ నుంచి భారీఎత్తున వస్తున్న పొగలు

సాక్షి, నందికొట్కూరు(కర్నూలు) : నందికొట్కూరు మండలం 10 బొల్లవరం గ్రామ సమీపంలోని శ్రీ చక్ర కోల్డ్‌స్టోరేజీలో మంగళవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా మంటలు చెలరేగినట్లు యజమాని చెబుతున్నారు. అందులో ఉన్న వ్యవసాయోత్పత్తులు కాలి బూడిదయ్యాయి. దీంతో సుమారు రూ.5 కోట్ల దాకా నష్టం వాటిల్లింది. తహసీల్దార్‌ హసీనా సుల్తానా తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. ఒంగోలుకు చెందిన రమేష్‌ అనే వ్యక్తి శ్రీచక్ర కోల్డ్‌ స్టోరేజీని కొత్తగా నిర్మించారు. ఇంకా కొన్ని పనులు పూర్తి కావాల్సి ఉంది. ఇందులో రమేష్‌తో పాటు మరో ఐదుగురికి చెందిన వ్యవసాయోత్పత్తులు నిల్వ చేశారు. ఎండు మిర్చి 25 టన్నులు, కందులు 25 టన్నులు, శనగలు 50 టన్నుల వరకు నిల్వ చేసినట్లు తెలుస్తోంది. అయితే..కోల్డ్‌స్టోరేజీలో మంగళవారం తెల్లవారుజామున నాలుగు గంటలకు విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం సంభవించింది. అక్కడున్న కూలీలు గమనించి 10 బొల్లవరం గ్రామస్తులకు తెలియజేశారు. వారు కర్నూలులోని అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చారు. అగ్నిమాపక సిబ్బంది వెంటనే వచ్చి మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. అయితే..భారీఎత్తున మంటలు ఎగిసిపడుతుండడంతో రాత్రి ఎనిమిది గంటల సమయానికి గానీ అదుపులోకి రాలేదు. మొత్తం నాలుగు ఫైరింజన్లను వినియోగించాల్సి వచ్చింది. ఈ ప్రమాదంలో వ్యవసాయోత్పత్తులన్నీ కాలి బూడిదయ్యాయి. కోల్డ్‌ స్టోరేజీ కూడా దెబ్బతింది. రూ.5 కోట్ల దాకా నష్టం జరిగినట్లు యాజమాని రమేష్‌ ఫిర్యాదు చేసినట్లు తహసీల్దార్‌ తెలిపారు. సంఘటన స్థలాన్ని సీఐ సుధాకరరెడ్డి, ఎస్‌ఐలు చంద్రశేఖర్‌రెడ్డి, శ్రీనివాసులు, ఆర్‌ఐ సత్యనారాయణ, వీఆర్వో పవిత్ర తదితరులు పరిశీలించారు. కాగా..ఈ ప్రమాదంపై స్థానికులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇన్సూరెన్స్‌ కోసమే ఇలా చేసి ఉంటారని అంటున్నారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

సెల్ఫీ వీడియో; నాకు చావే దిక్కు..!

అమీర్‌పేటలో బాంబు కలకలం

దాచాలంటే దాగదులే!

వేర్వేరు చోట్ల ఐదుగురు ఆత్మహత్య

హత్య చేసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు

ప్రేమ పెళ్లి చేసుకొన్న ఆటోడ్రైవర్‌ ఆత్మహత్య!

బస్సులో మహిళ చేతివాటం! ఏకంగా కండక్టర్‌కే..

పెళ్లైన 24 గంటలకే విడాకులు

అత్తింటి ఆరళ్లు! అన్నను ఎందుకు రానిచ్చవంటూ...

ఖాకీ వేషంలో ఉన్న దొంగల అరెస్టు

నగ్నంగా ఉంటే నయమవుతుంది!

నెత్తురోడిన రహదారులు

ఆ రెండు కమిషనరేట్లలో 1000 మంది రౌడీ షీటర్లు!

తప్పతాగి.. పోలీసుపై మహిళ వీరంగం!

చివరిసారిగా సెల్ఫీ..

పెళ్లి పేరుతో మోసం నటుడి అరెస్ట్‌

సినీ నటితో అసభ్య ప్రవర్తన

మోసం.. ఆపై ఆత్మహత్యాయత్నం.!

14 ఏళ్ల బాలికను వేధించిన 74 ఏళ్ల వృద్ధ మృగాడు!

కుమార్తె వద్దకు వెళ్లి తిరిగి వస్తూ..

రాజాంలో దొంగల హల్‌చల్‌

నన్ను ప్రేమించలేదు..అందుకే చంపేశాను

ఫేస్‌బుక్‌ రిలేషన్‌; వివాహితపై అత్యాచారం

రాంప్రసాద్‌ హత్య కేసులో మరో నలుగురు రిమాండ్‌ 

ఉద్యోగాల పేరుతో మోసపోయిన విద్యార్థినిలు

హత్య చేసి.. శవంపై అత్యాచారం

విడాకులు కోరినందుకు భార్యను...

జైలుకు వెళ్లొచ్చినా ఏం మారలేదు..

ఆటోను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

మాజీ ఫుట్‌బాల్‌ ప్లేయర్‌ దారుణ హత్య

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

తమన్నా ప్లేస్‌లో అవికానా!

‘పూరి ముఖంలో సక్సెస్‌ కనిపించింది’

బిజీ అవుతోన్న ‘ఏజెంట్‌’

అమ్మదగ్గర కొన్ని యాక్టింగ్‌ స్కిల్స్ తీసుకున్నాను..

నాన్నా.. బయటకు వెళ్లు అన్నాడు!

ఇప్పుడు ‘గ్యాంగ్‌ లీడర్’ పరిస్థితేంటి?