షార్ట్‌ ఫిలిం డైరెక్టర్‌ యోగేష్‌ అరెస్ట్‌

27 Dec, 2017 21:25 IST|Sakshi

బెయిల్‌ దొరకినా పూచీకత్తు సమర్పించడంలో ఆలస్యం

చర్లపల్లి జైలుకు తరలించిన పోలీసులు

గచ్చిబౌలి: లఘుచిత్రాల్లో నటించే మహిళా సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌కు అసభ్యకరమైన మేసేజ్‌లు పంపి వేధిస్తున్న కేసులో తప్పించుకు తిరుగుతున్న షార్ట్‌ ఫిలిం డైరెక్టర్‌ యోగేష్‌ కుమార్‌ను గచ్చిబౌలి పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఎస్‌ఐ రాజేందర్‌ తెలిపిన వివరాల మేరకు... బీహెచ్‌ఈఎల్‌ ఎంఐజీలో నివాసం ఉండే ముత్యాల యోగేష్‌ కుమార్‌(35)కు ఏడాది క్రితం గచ్చిబౌలిలో నివాసముండే హారికతో ఫేస్‌బుక్‌లో పరిచయం ఏర్పడింది. అయితే ఈ పరిచయంతో హారిక వాట్సాప్‌ నంబర్‌కే కాకుండా, ఆమె భర్త ఫోన్‌కు కూడా అసభ్యకర సందేశాలు పంపిస్తూ వేధిస్తున్నాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడు యోగి సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ ఆధారంగా బుధవారం పోలీసులు అతన్ని పట్టుకున్నారు. అతడి సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కూకట్‌పల్లి 25ఎంఎం కోర్టులో హాజరుపరచగా మెజిస్ట్రేట్‌ వరూధిని బెయిల్‌ మంజూరు చేశారు. సమయానికి పూచీకత్తు చెల్లించకపోవడంతో యోగేష్‌ను చర్లపల్లి జైలుకు తరలించారు. త్వరలో కస్టడీలోకి తీసుకోనున్నట్లు పోలీసులు తెలిపారు.

మరిన్ని వార్తలు