హీరో అర్జున్‌పై నటి శ్రుతి ఫిర్యాదు

28 Oct, 2018 04:48 IST|Sakshi
శ్రుతి హరిహరణ్‌,అర్జున్‌

బెంగళూరు: బహుబాషా నటుడు, యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ లైంగికంగా వేధిస్తూ తన గౌరవానికి భంగం కలిగించేలా ప్రవర్తించాడని బెంగళూరు లోని పోలీస్‌స్టేషన్‌లో హీరోయిన్‌ శ్రుతి హరిహరణ్‌ ఫిర్యాదు చేశారు. 2016లో విడుదలైన ద్విభాషా చిత్రం ‘విస్మయ’ చిత్రీకరణ సందర్భంగా అర్జున్‌ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఐపీసీ 354, 354ఏ(మహిళల గౌరవాన్ని భంగపర్చడం), 506(బెదిరింపులకు పాల్పడటం), 509(మాటలు చేష్టల ద్వారా గౌరవానికి భంగం కలిగించడం) సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదుచేశారు. కాగా, తనపై తప్పుడు ఆరోపణలు చేశారంటూ అర్జున్‌ ఆమెపై రూ.5 కోట్ల పరువునష్టం దావా వేశారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు