రోడ్డుపై ఎస్‌ఐ, యువకుడి బాహాబాహి

4 Apr, 2018 09:57 IST|Sakshi
ఎస్‌ఐతో తలపడుతున్న యువకుడు ప్రకాష్‌

టీ.నగర్‌:  బైక్‌లో ట్రిబుల్‌ రైడింగ్‌ను అడ్డుకున్న ఎస్‌ఐతో యువకుడు బాహాబాహి తలపడ్డాడు. చెన్నై మాంబళం పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని పోతీస్‌ వస్త్ర దుకాణం సమీపం ట్రాఫిక్‌ ఎస్‌ఐ సురేష్, స్పెషల్‌ ఎస్‌ఐ జయరామన్‌  సోమవారం సాయంత్రం ట్రాఫిక్‌ నియంత్రిస్తున్నారు. ఆ సమయంలో హెల్మెట్‌ లేకుండా బైక్‌పై ఇద్దరు మహిళలతో యువకుడు ప్రయాణించాడు. ఎస్‌ఐ సురేష్‌ యువకుడిని అడ్డుకుని ప్రశ్నించగా తన తల్లి, చెల్లెలితో అత్యవసర పనిపై వెళుతున్నట్లు తెలిపాడు. హెల్మెట్‌  ఎందుకు ధరించలేదని ప్రశ్నించగా యువకుడు వెటకా రంగా బదులిచ్చినట్లు సమాచారం.

దీంతో ఎస్‌ఐ బైక్‌ కీ తీసుకున్నాడు. ఎస్‌ఐ చేతిలోని బైక్‌ కీని యువకుడు లాక్కోవడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఇద్దరు బాహాబాహీ తలపడ్డారు.దీనిపై ఎస్‌ఐ సురేష్‌ మాంబళం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు యువకుడిని పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చి విచారణ  జరపగా అతడు చెన్నై సాలిగ్రామం జానకీరామన్‌ వీధికి చెందిన ప్రకాష్‌(21) కార్ల విక్రయ సంస్థలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. పోలీసులు సంఘటనా స్థలంలో సీసీ కెమెరా పుటేజీలను పరిశీలించారు. అధికారి విధి నిర్వహణను అడ్డుకోవడం సహా మూడు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి యువకుడిని అరెస్టు చేశారు.

మరిన్ని వార్తలు