బంజారాహిల్స్ ల్యాండ్ కేసులో మ‌రో కోణం

14 Jul, 2020 20:22 IST|Sakshi

సాక్షి, హైద‌రాబాద్‌: బంజారాహిల్స్‌లో 50 కోట్ల రూపాయ‌ల‌ విలువైన ల్యాండ్ కేసులో మంగ‌ళ‌వారం కొత్త‌ కోణం బ‌య‌ట‌ప‌డింది. ఎక‌రా 20 గుంటలకు చెందిన‌ ల్యాండ్ పత్రాలన్నీ ఏసీబీ అధికారులు నకిలీవిగా తేల్చారు. ఈ కేసులో కోర్టుకు అంద‌జేసిన పత్రాలు సైతం అన్ని ఫోర్జ‌రీవేన‌ని విచార‌ణలో విల్ల‌డైంది. ఈ కేసులో అర‌కోటి లంచం తీసుకుంటూ ఆర్ఐ నాగార్జున రెడ్డి పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. షేక్‌పేట త‌హ‌సీల్దారు సుజాత‌ను సైతం అరెస్ట్ చేశారు. ఈ కేసును ఆల‌స్యం చేసేందుకు ఎస్సై ర‌వీంద్ర నాయ‌క్‌ రూ. 3 లక్షలు డిమాండ్ చేస్తూ ఏసీబీకి ప‌ట్టుబ‌ట్టాడు. ఇప్ప‌టికే ఈ కేసులో భూమిని క‌బ్జా చేసేందుకు ప్ర‌య‌త్నించిన‌ పాత‌బ‌స్తీకి చెందిన‌ స‌య్య‌ద్ ఖాలీద్‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని గ‌తంలో రెవెన్యూ అధికారులు ఏసీబీకి ఫిర్యాదు చేశారు. దీనిపై సీపీ అంజ‌నీకుమార్‌కు ఏసీబీ అధికారులు లేఖ రాశారు.(కబ్జాదారుడికి సహకరించిన రెవెన్యూ ఇన్‌స్పెక్టర్, ఎస్‌ఐ అరెస్ట్‌ )

ఏం జ‌రిగిందంటే..
బంజారాహిల్స్‌ రోడ్‌ నెం.14లో ఉన్న 4865 గజాల(సుమారు రెండెక‌రాలు) ప్రభుత్వ స్థలాన్ని సయ్యద్‌ అబ్దుల్‌ ఖాలిద్‌ అనే వ్యక్తి ఆక్రమించి హెచ్చరిక బోర్డును తొలగించి తన పేరుతో  బోర్డు ఏర్పాటు చేశాడు. అయితే అది ప్రభుత్వ స్థలం కావడంతో తహసిల్దార్‌ సుజాత ప‌లుమార్లు బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే సదరు స్థలాన్ని  ప్రైవేట్‌ పరం చేస్తూ హద్దులు చూపిస్తానంటూ అదే కార్యాలయంలో పని చేస్తున్న ఆర్‌ఐ నాగార్జున రెడ్డి ఖాలిద్‌ నుంచి రూ.30 లక్షలు డిమాండ్‌ చేశాడు. ఇందులో భాగంగా శనివారం ఖాలిద్‌ రూ.15 లక్షల నగదును నాగార్జున రెడ్డికి ఇస్తుండ‌గా ఏసీబీ అధికారులు ప‌ట్టుకున్నారు. మ‌రోవైపు పోలీసులు అత‌డిని అరెస్ట్ చేయ‌కుండా ఉండేందుకు లంచం అడిగిన ఎస్సై ర‌వీంద‌ర్‌ను సైతం ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు.  (శివారుపై ఏసీబీ కన్ను)

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా