ప్రియుడితో కలిసి భర్తను కడతేర్చిన కాబోయే ఎస్సై

5 Feb, 2019 19:46 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఓ కాబోయే ఎస్సై  హైదరాబాద్‌లో భర్తను హత్య చేసింది. అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన రైల్వే ఉద్యోగి శ్రీనివాస్‌ కేసులో కొత్తకోణం వెలుగు చూసింది. అతన్ని హత్యచేసింది భార్య సంగీతే అని పోలీసులు గుర్తించారు. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. శ్రీనివాస్‌ కేసు దర్యాప్తు చేస్తుండగా వదిన సంగీతపైనే అనుమానం ఉందని సోదరుడు సురేష్‌ చెప్పాడు. ఆ కోణంలో విచారణ జరపడంతో నిందితురాలి వ్యవహారం బయటపడింది. భార్యపై అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు క్లూస్‌ టీమ్‌ సహకారంతో సంగీతను అమె ప్రియుడు, వరుసకు మేనల్లుడైన విజయ్‌ను అరెస్ట్‌ చేశారు. కొద్ది రోజుల క్రితం జరిగిన ఎస్సై పరీక్షల్లో సంగీత అర్హతసాధించింది. 

మేనల్లుడితో వివాహేతర సంబంధం పెట్టుకున్న సంగీతతో శ్రీనివాస్‌ అనేక సార్లు గొడవపడ్డాడు. అతన్ని కలవడం మానుకోవాలని హెచ్చరించాడు. అయినా సంగీత వినకపోవడంతో శ్రీనివాస్‌ మద్యానికి బానిసయ్యాడు. ఇటీవలే జరిగిన ఎస్సై పరీక్షల్లో నెగ్గిన సంగీత భర్తను ఎలాగైనా వదిలించుకోవాలనుకుంది. మేనల్లుడితో వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్త హత్యకు ప్లాన్‌ వేసింది.

మొదట కరెంట్‌ షాక్‌తో భర్తను చంపాలని సంగీత నిర్ణయించుకుంది. విజయ్‌ సలహాతో సంగీత ప్లాన్‌ మార్చింది. నిద్రమత్తులో ఉన్న భర్తను హత్య చేయాలని ప్లాన్‌ వేసింది. మద్యం మత్తులో ఇంటికొచ్చిన శ్రీనివాస్‌ను ప్రియుడితో కలిసి చంపేసింది. మేనల్లుడు భర్తతలపై బండరాయితో మోదుతుంటే కదలకుండా సంగీత గట్టిగా పట్టుకుంది. అరుపులు వినపడకుండా రైలు వచ్చేటప్పుడు భర్తను సంగీత చంపింది.ఇద్దరు కలిసి శవాన్ని చాపలో చుట్టి బోరబండ రైల్వే ట్రాక్‌ పక్కన పడేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. నిందితురాలు సంగీత బీఈడీ చదివింది.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా