హవాలా మోసం

13 May, 2018 08:50 IST|Sakshi
ప్రియ

సాక్షి, చెన్నై: హవాలా మోసం వ్యవహారానికి సంబంధించి ఓ అందగత్తెతో ఎస్‌ఐ ఆడియో వాట్సప్‌లో విడుదలై సంచలనం కలిగిస్తోంది. ఈ వ్యవహారానికి సంబంధించి పలువురు పోలీసు అధికారులు పట్టుబడనున్నట్లు సమాచారం. శనివారం వెల్లడైన వివరాల మేరకు తమిళనాడు విల్లుపురం జిల్లా స్పెషల్‌ క్రైంబ్రాంచిలో ఎస్‌ఐగా పనిచేస్తున్న పూంగుండ్రన్‌కు నకిలీ నోట్లు, బంగారు బిస్కెట్లు, కార్ల మోసానికి పాల్పడే బెంగళూరు యువతి ప్రియతో సంబంధాలు ఏర్పడ్డాయి. అంతేకాకుండా పలువురు ఉన్నతాధికారులకు ఈ వ్యవహారంలో భాగస్వామ్యం ఉండడంతో ఎస్‌ఐ పూంగుండ్రన్‌ ముఖ్య వ్యక్తిగా చలామణి అయ్యాడు.

బెంగళూరు హవాలా ప్రియకు, పోలీసు ఎస్‌ఐ పూంగుండ్రన్‌కు నగదు లావాదేవీలలో వివాదం ఏర్పడడంతో ఎస్‌ఐ ప్రియకు హత్యా బెదిరింపులు చేసిన ఆడియో వాట్సప్‌లో విడుదలై సంచలనం కలిగించింది. ఈ సంభాషణలో పూంగుండ్రన్‌ తాను పలువురి దగ్గర నగదు తీసుకుని నీకిచ్చానని, అయితే చెప్పిన విధంగా కార్లు, బంగారం ఇవ్వకుండా మోసగిస్తున్నట్లు ఆరోపించాడు. ఈ వ్యవహారంలో పలువురు అధికారులు పట్టుబడనున్నట్లు సమాచారం.

మరిన్ని వార్తలు