పేలుళ్లకు పన్నాగం

20 Jan, 2020 08:10 IST|Sakshi
పోలీసుల అదుపులో ఉన్న అనుమానిత ఉగ్రవాదులు

హత్యలకు పథకం దక్షిణాదిలో ఐసిస్‌ బలోపేతం  

ఇదీ ఉగ్రవాద ముఠా స్కెచ్‌  

సీసీబీ విచారణలో కీలక నిందితుడు పాషా వెల్లడి

బెంగళూరుకు భారీ పేలుళ్లు ముప్పు తప్పినట్లయింది. సకాలంలో ఉగ్రవాద ముఠా పట్టుబడడంతో ఆస్తి, ప్రాణ నష్టాలు సంభవించకుండా ఖాకీలు అడ్డుకున్నారు. దక్షిణాదిలో జిహాదీ ఉగ్రవాదాన్ని మూలమూలలకూ విస్తరించడం, యువతను అందులోకి చేర్చుకోవడం, విధ్వంసం సృష్టించడమే ముఠా అజెండాగా వెల్లడైంది. వీరు కొనుగోలు చేసిన సిమ్‌కార్డులు పశ్చిమబెంగాల్‌లో పనిచేస్తుండడం గమనార్హం. ముఠాకు చెందిన ఇద్దరు మాస్టర్‌మైండ్లు శివమొగ్గ జిల్లా నుంచి పరారైనట్లు గుర్తించారు.

కర్ణాటక, బనశంకరి: ఉద్యాన నగరంలో జనసమ్మర్ధం కలిగిన ప్రాంతాల్లో బాంబు పేలుళ్లు, ఓ వర్గానికి చెందిన ముఖ్య నేతల హత్యలకు పథకం రూపొందించినట్లు పోలీసుల విచారణలో మహబూబ్‌ పాషా వెల్లడించాడు. సెంట్రల్‌ క్రైం బ్రాంచ్‌ పోలీసులు రహస్య స్థలంలో అతన్ని విచారిస్తున్నారు. భయానకమైన అంశాలను వెల్లడించడంతో విచారణను తీవ్రతరం చేశారు. అంతేగాక ముఖ్యమంత్రి సొంత జిల్లా శివమొగ్గ తీర్థహళ్లిలో ఇద్దరు మాస్టర్‌మైండ్స్‌ ఉన్నట్లు ఇతడు బయటపెట్టాడు. ఓ ఎంపీ హత్యకు, విధ్వంసానికి కుట్రపన్నిన ఆరుగురిని శుక్రవారం బెంగళూరు పోలీసులు అరెస్టు చేయడం తెలిసిందే. ఈ ముఠాలో ముఖ్యమైన మహబూబ్‌పాషాను ఖాకీలు లోతుగా విచారిస్తున్నాడు. ఇతడు విప్పిన గుట్టుమట్ల ఆధారంగా మాస్టర్‌ మైండ్స్‌ కోసం సీసీబీ పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు.  

10 సిమ్‌కార్డులు కొనుగోలు
దక్షిణ భారతదేశంలో ఐసిస్‌ ఉగ్రవాద సంస్థను బలోపేతం చేయడానికి ఈ జిహాదీ గ్యాంగ్‌ పనిచేస్తోందని గుర్తించారు.  10 మొబైల్‌ సిమ్‌కార్డుల కొనుగోలు ఆధారంగా విచారణ చేపట్టి సీసీబీ పోలీసులు అరెస్ట్‌చేశారు. కీలక నిందితుడు మహబూబ్‌పాషా ఐసిస్‌ దక్షిణ భారత కమాండర్‌గా గుర్తించారు. 2019 ఏప్రిల్‌లో తమిళనాడు హిందూనేత సురేశ్‌ హత్య కేసులో నిందితుడు అనుమానిత ఉగ్రవాది మోహినుద్దీన్‌ఖాజా జామీను తీసుకున్న అనంతరం పరారీలో ఉన్నాడు.  సేలంలో మోహినుద్దీన్‌ ఖాజా శిష్యుడు ఒకరు నకిలీ పత్రాలు అందించి 10 సిమ్‌కార్డులు కొనుగోలు చేశాడు. ఈ సిమ్‌కార్డులు కోలారు, పశ్చిమబెంగాల్‌లోని బురŠాద్వన్‌లలో పనిచేస్తున్నట్లు పోలీసులు కనిపెట్టారు. తక్షణం ఐఎస్‌డీ, సీసీబీ పోలీసులు అప్రమత్తమై సుద్దగుంటెపాళ్యలోని ఓ ఇంటిలో మహబూబ్‌పాషా అనుచరుడిని అరెస్ట్‌ చేశారు. సీసీబీ, ఐఎస్‌డీ పోలీసులు అప్రమత్తమై జరగబోయే భారీ ముప్పు నుంచి తప్పించగలిగారు.   

శ్రీలంక పేలుళ్లతో సంబంధం?
మహబూబ్‌ పాషా కేవలం యువకులనే నియమించుకుని వారికి శిక్షణనిచ్చేవాడు. శ్రీలంకలో గుడ్‌ఫ్రైడే నాడు చర్చిలు, హోటళ్లలో జరిగిన బాంబుదాడుల్లో పాల్గొన్న ఉగ్రవాదులు ఈ ముఠాలో ఉన్నారనే అనుమా నం వ్యక్తమౌతోంది. మహబూబ్‌ పాషా అరెస్టైన అనంతరం తీర్థహళ్లిలో ఉన్న ఇద్దరు మా స్టర్‌మైండ్స్‌ ఉడాయించినట్లు తెలిసింది. ఒక వర్గం యువకులను ఉగ్రవాద కార్యకలాపాలకోసం నియామకాలు, శిక్షణను మహ బూబ్‌పాషా చూసేవాడు. చివరికి తన ఇద్దరు కు మారులను కూడా ఉగ్రవాద శిక్షణనిచ్చాడు.

మరిన్ని వార్తలు