సిర్పూర్‌ పేపర్‌మిల్లులో ప్రమాదం

23 Feb, 2020 06:33 IST|Sakshi

కొమురం భీం (ఆసిఫాబాద్): జిల్లాలోని సిర్పూర్‌ పేపర్‌ మిల్లులో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నూతన బాయిలర్‌ నిర్మాణ కోసం పిల్లర్లు తవ్వుతున్న ప్రాంతంలో మట్టి పెళ్లలు కుప్పకులాయి. ఒక్కసారిగా మట్టిపెళ్లలు పడటంతో కూలీలు ఇరుక్కుపోయారు. ఈ ఘటనలో ముగ్గురు కూలీలు మృతి చెందగా.. గాయపడ్డ నలుగురు కూలీలను చికిత్స కోసం మంచిర్యాల, కరీంనగర్‌ ఆస్పత్రులకు తరలించారు.

ప్రమాదం జరిగిన వెంటనే రంగంలోకి దిగిన రెస్క్యూ టీం, పోలీసుల సాయంతో కూలీలను బయటకు తీశారు. ఈ ప్రమాదంలో స్పామ్‌ కార్మికులు అంతా సురక్షితంగా ఉ‍న్నారు. ప్రమాదంలో చిక్కుకున్న కూలీలు బాయిలర్‌ నిర్మాణ పనులకు వచ్చిన వారిగా తెలుస్తోంది. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా