ఆస్తి కోసం అక్క మొగుడే..

22 Jan, 2020 08:08 IST|Sakshi
పోలీసులు అరెస్టు చేసిన మణికంఠన్, గౌరీ శంకర్‌

ఆస్తి కోసం దారుణం ఇద్దరు అరెస్టు

చెన్నై, సేలం: రాసిపురం సమీపంలో అప్పులను తీర్చు కోవడానికి ఆస్తి కోసం బావమరిదిని స్నేహితుల సాయంతో హత్య చేసిన బావతో సహా ఇద్దరిని పోలీసులు అరెస్టు చేసి మంగళవారం జైలుకు తరలించారు. సేలం జిల్లా మల్లూర్‌ ప్రాంతానికి చెందిన వ్యక్తి పళమియప్పన్‌. ఇతనికి ఈశ్వరి, శశికల అనే ఇద్దరు కుమార్తెలు, వెంకటేశన్‌ అనే కుమారుడు ఉన్నా రు. ఇద్దరి కుమార్తెలకు వివాహం జరగగా, కుమారుడు వెంకటేశన్‌ అదే ప్రాంతంలో ఉన్న పాఠశాలలో ప్లస్‌టూ చదువుకుంటున్నాడు. ఈ స్థితిలో వెంకటేశన్‌ శనివారం హత్యకు గురైయ్యాడు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెంకటేష్‌ చిన్న అక్క శశికళ భర్త మణికంఠన్‌తో స్నేహంగా మెలుగుతున్నట్టు తెలియడంతో అతని వద్ద విచారణ జరిపారు.

అప్పుడు చేనేత కార్మికుడైన మణికంఠన్‌ వివాహం జరిగిన సమయం నుంచే అప్పులు అధికంగా ఉన్నట్టుగాను, అప్పుడప్పుడు పని వెళ్లకపోవడం వలన అప్పులు తీర్చలేని స్థాయికి పెరిగాయి. దీంతో అత్తింటి ఆస్తిని కాజేసి అప్పులు తీర్చుకోవాలని అనుకున్నాడు. అందుకు అడ్డుగా ఉన్న భార్య తమ్ముడు వెంకటేశన్‌ను హత్య చేసి అడ్డు తొలగించుకోవాలనుకున్నాడు. దీంతో అదే ప్రాంతానికి చెందిన స్నేహితుడు గౌరి శంకర్‌తో కలిసి శనివారం వెంకటేశన్‌కు ఫోన్‌ చేసి, మద్యం సేవించడానికి వెళదామంటూ కారులో మునియప్పన్‌ ఆలయ సమీపంలోని చెరువు వద్దకు తీసుకు వెళ్లి, అతనికి బాగా మద్యం తాగించి, తలపై పెద్ద బండరాయి వేసి దారుణంగా హత్య చేసినట్టు మణికంఠన్‌ పోలీసులకు వాగ్మూలం ఇచ్చాడు. దీంతో పోలీసులు వారిని అరెస్టు చేసి, కోర్టులో హాజరు పరిచి మంగళవారం రిమాండ్‌కు తరలించారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా