ఘోర ప్రమాదం : ఆరుగురు మృతి

16 Jul, 2020 11:56 IST|Sakshi

సాక్షి, చెన్నై: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. విల్లుపురం జిల్లా, టిండివనం సమీపంలో గురువారం తెల్లవారుజామున  జరిగిన ఈ ప్రమాదంలో  డ్రైవర్‌తో సహా ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని నింపింది.  కన్యాకుమారి నుంచి చెన్నైకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.బాధితులను తిరునెల్వేలి జిల్లాలోని తిసయన్‌విలైకి చెందిన మురుగేష్ (40) మురుగేష్‌ భార్య మలార్ (30), మురుగరాజ్ (38) సోరి మురుగన్(35)  హరీష్ (6), ముత్తు మనీషా (8)గా గుర్తించారు. పోలీసుల సమాచారం ప్రకారం అతివేగంతో అదుపు తప్పిన  వాహనం రోడ్డు పక్కన ఉన్న గోతిలోకి బోల్తాపడింది. 

డ్రైవర​ వాహనంపై నిద్రలో  ఉండి నియంత్రణ కోల్పోవడమే  ప్రమాదానికి కారమని అనుమానిస్తున్నారు. కరోనా వైరస్‌, లాక్‌డౌన్‌, తెల్లవారు ఝామున వెలుతురు సరిగ్గా లేకపోవడంతో ప్రమాద విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. విల్లుపురం జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ఎస్ రాధాకృష్ణన్, టిండివనం డీఎస్‌పీ కనగేశ్వరి సంఘటనా స్థలానికి చేరుకుని సహయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం తరలించామని, కేసు నమోదు చేశామనీ, దర్యాప్తు జరుగుతోందని  పోలీసు అధికారి వెల్లడించారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు