పాప్‌కార్న్‌ మిషన్‌లో బంగారం

4 Jan, 2018 08:01 IST|Sakshi

చెన్నై ఎయిర్‌పోర్టులో స్మగ్లర్‌ అరెస్ట్‌

టీ.నగర్‌: దుబాయ్‌ నుంచి చెన్నైకు వచ్చిన విమానంలో పాప్‌కార్న్‌ మిషన్‌లో తీసుకొచ్చిన బంగారాన్ని బుధవారం అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్‌ నుంచి చెన్నైకు ఇండిగో ఎయిర్‌లైన్స్‌ విమానంలో వచ్చిన ప్రయాణి కుల వద్ద కస్టమ్స్‌ అధికారులు తనిఖీలు జరిపారు. నవాజ్‌ మాకింగల్‌ గెయిత్పాయిల్‌ అనే వ్యక్తి లగేజీని తనిఖీ చేయగా హానర్‌ పాప్‌కార్న్‌ మిషన్, తోషిబా రేడియో కనిపించాయి. వీటి బరువులో వ్యత్యాసం ఉండడంతో అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు.

పాప్‌కార్న్‌ మిషన్‌లో తొమ్మిది రేకులు, రేడియోలో 27 రేకులు సిల్వర్‌ కలర్‌లో కనిపించాయి. వీటిని పరిశీలించగా అవన్నీ 24 క్యారెట్‌ బంగారంగా తెలిసింది. వీటి బరువు 782 గ్రాములు. విలువ రూ.23లక్షలుగా తెలిసింది. బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకుని నవాజ్‌ మాకింగల్‌ గెయిత్పాయిల్‌ను అరెస్టు చేశారు. 

మరిన్ని వార్తలు