పరారీలో పైలట్‌ తల్లిదండ్రులు

27 Jun, 2020 20:57 IST|Sakshi

లావణ్య లహరి ఆత్మహత్య కేసు

రిమాండ్‌కు భర్త వెంకటేశ్వరరావు

సాక్షి, హైదరాబాద్‌: సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని లావణ్య లహరి ఆత్మహత్య కేసులో ఆమె భర్త వెంకటేశ్వరరావును పోలీసులు రిమాండ్‌కు తరలించారు. లావణ్య అత్తామామ రమాదేవి, మల్లాది సుబ్బారావు పరారీలో ఉన్నట్టు తెలిసింది. వారికోసం పోలీసులు గాలిస్తున్నారు. కాగా, రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో నివాసముండే లావణ్య లహరి (32) శుక్రవారం ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. భర్త వెంకటేశ్వరరావు ప్రవర్తనతో విసిగి.. ఆత్మహత్య చేసుకుంటున్నట్టు ఆమె వీడియో తీసి ఫేస్‌బుక్‌లో పోస్టు చేసింది. లావణ్య, వెంకటేశ్వరరావుది ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా. వారిద్దరు ప్రేమించుకుని, పెద్దల అంగీకారంతో 2012లో పెళ్లి చేసుకున్నారు.
(చదవండి: వీడియో: పైలట్‌ మొగుడి పైశాచికం!)

వెంకటేశ్వర్‌రావు ఓ ప్రైవేటు ఎయిర్‌లైన్స్‌లో పైలట్‌. లావణ్య సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌. రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లోని సీఎస్‌కే విల్లాలో ఉంటున్నారు. వీరికి సంతానం కలగలేదు. వెంకటేశ్వర్‌రావు కొంతకాలంగా మరో మహిళతో చనువుగా ఉండటంతో పాటు సంతానం కలగలేదనే వేధింపులు పెరగడంతో లహరి మనస్తాపం చెందింది. గురువారం రాత్రి కూడా ఇదే విషయమై దంపతులు గొడవపడ్డారు. దాంతో ఇంట్లో ఎవరూ లేనిది చూసి ఆమె శుక్రవారం మధ్యాహ్నం బలవన్మరణానికి పాల్పడింది. ఇదిలాఉండగా.. లావణ్య మృతిపై ఆమె తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేశారు. అల్లుడు వెంకటేశం తన కూతురిని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని లావణ్య తండ్రి ఈశ్వరయ్య ఆరోపించారు.


(చదవండి: కరోనా జయించిన బాలాపూర్‌ సీఐ)

మరిన్ని వార్తలు