‘సాఫ్ట్‌వేర్ల’ గంజాయి వ్యాపారం

27 Dec, 2018 10:36 IST|Sakshi

సాక్షి,సిటీబ్యూరో:  గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లను ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ పోలీసులు అరెస్టు చేశారు. బోరబండ ప్రాంతంలో నిర్వహించిన తనిఖీల్లో బసవాపురం సాయిచరణ్‌(24), పసుల శ్రీకాంత్‌(23)లను అరెస్టుచేసి వారి వద్ద నంచి 1.2 కిలోల డ్రై గంజా, రెండు మొబైల్‌ఫోన్లు,ఒక బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. వీరిద్దరు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లుగా పనిచేస్తున్నారని పోలీసులు తెలిపారు. గంజాయికి అలవాటుపడిన వీరిద్దరు అరకు నుంచి కాకుండా గంజాయి తీసుకొచ్చి 25, 50 గ్రాముల ప్యాకెట్లలో గంజాయిని నింపి ఎస్‌.ఆర్‌.నగర్,అమీర్‌పేట్,బంజారాహిల్స్‌ తదితర ప్రాంతాల్లో పలువురికి విక్రయించినట్లు తమ ప్రాథమిక విచారణలో తేలినట్లు ఎక్సైజ్‌ పోలీసులు తెలిపారు. తదుపరి విచారణ నిమిత్తం ఈ కేసును అమీర్‌పేట్‌ పోలీసులకు అప్పజెప్పారు. నగర ఎక్సైజ్‌ విభాగం డిప్యూటీ కమీషనర్‌ సి.వివేకానందరెడ్డి ఆదేశాల మేరకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం ఏఈఎస్‌ ఎన్‌.అంజిరెడ్డిల పర్యవేక్షణలో ఈ దాడులు నిర్వహించినట్లు తెలిపారు.

>
మరిన్ని వార్తలు