ఇవే ఆధారాలు.. నైలాన్‌ తాడు, బంగారు గాజులు

18 Mar, 2020 06:36 IST|Sakshi
క్లూస్‌టీం, జాగిలంతో పరిశీలిస్తున్న పోలీసులు

గ్రామ శివారులో మహిళ దారుణ హత్య

కల్వర్టు కింద మృతదేహం

హత్యాచారం జరిగి ఉండొచ్చని అనుమానం

నగ్నంగా పడి ఉన్న మృతదేహం

బండరాళ్లతో కొట్టిచంపిన దుండగులు

చేవెళ్ల: మహిళ దారుణ హత్యతో చేవెళ్ల మండల పరిధిలోని తంగడపల్లి ఉలిక్కిపడింది. మంగళవారం ఉదయం గ్రామ శివారులోని కల్వర్టు కింద ఓ మహిళ మృతదేహం నగ్నంగా పడిఉండటంతో ఒక్కసారిగా కలకలం రేగింది. దుండగులు మహిళ ముఖంపై బండరాళ్లతో కొట్టడంతో పూర్తిగా ఛిద్రమైంది. శంషాబాద్‌ జోన్‌ డీసీపీ ప్రకాశ్‌రెడ్డి, చేవెళ్ల సీఐ బాలకృష్ణ, ఎస్‌ఐ రేణుకారెడ్డి సిబ్బందితో వివరాలు సేకరించారు.దుండగులు ఎక్కడో మహిళనుచంపేసి మృతదేహాన్ని ఇక్కడికి తీసుకొచ్చి పడేసి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహంపై  దుస్తులు లేకపోవడంతో లైంగిక దాడి జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. మృతదేహం పక్కన  తాడు లభించింది. దీంతో గుర్తుతెలియని వ్యక్తులు మృతదేహాన్ని వాహనంలో తీసుకొచ్చి కల్వర్టు పైనుంచి కిందికి దించి పడేసి పోయి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే మహిళ ఒంటిపై రెండు బంగారు గాజులు, ఆమె వేలికి బంగారు ఉంగరం, మెడలో గోల్డ్‌ లాకెట్‌ ఉన్నాయి. క్లూస్‌టీం, జాగిలాలతోపరిశీలించినా ఎలాంటి ఆనవాళ్లు లభించలేదు. కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని, త్వరలో నిందితులను పట్టుకుంటామని శంషాబాద్‌ డీసీపీ ప్రకాశ్‌రెడ్డి పేర్కొన్నారు. మృతదేహాన్ని చేవెళ్ల ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. చదవండి: ప్రేమ వల; తల్లయిన పీయూసీ బాలిక

రెండు బంగారు గాజులు, బంగారు ఉంగరం, మెడలో గోల్డ్‌ లాకెట్‌
నిందితులను శిక్షించాలి

తంగడపల్లి మీదుగా హైదరాబాద్‌–వికారాబాద్‌ రహదారి ఉంది. ఇటీవల రోడ్డును విస్తరించడంతో వాహనాల రాకపోకలు పెరిగాయి. మహిళ హత్యతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాం. గ్రామ శివారులో ఘటన జరిగింది. మృతదేహం పడి ఉన్న కల్వర్టు మూలమలుపులో ఉండటంతో స్థానికులకు కనిపించదు. ఇక్కడ చెట్లు కూడా బాగా ఉండటంతో నిర్మానుష్యంగా ఉంటుంది. పోలీసులు నిందితులను పట్టుకొని కఠినంగా శిక్షించాలి.  – అనూషసత్తయ్యగౌడ్,సర్పంచ్, తంగడపల్లి.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా