సోమిరెడ్డిపై ఫోర్జరీ కేసు నమోదు

28 Aug, 2019 12:29 IST|Sakshi

రాజకీయ పరపతితో రికార్డులు తారుమారు చేసి భూదందా

సాక్షి, వెంకటాచలం: అధికారాన్ని అడ్డుపెట్టుకొని మాజీ మంత్రి, టీడీపీ నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి సాగించిన భూదందాపై కోర్టు ఆదేశాలతో మంగళవారం ఎట్టకేలకు  పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే..వెంకటాచలం మండలం ఇడిమేపల్లిలో పామర్రు పిచ్చిరెడ్డికి సర్వే నెంబరు 581 ప్రకారం 8.89ఎకరాలు, 583 ప్రకారం 4.42 ఎకరాలతో మొత్తం కలిపి 13.71ఎకరాల భూమి ఉంది. ఇందులో 10.94 ఎకరాలకు పంపకాలు సరిగా జరగలేదనే వివాదం ఉంది. దీంతో విషయం అప్పట్లో సోమిరెడ్డి దృష్టికి వెళ్లడంతో లేని రికార్డులను సృష్టించారు.

సర్వే నంబరు 583 ప్రకారం ఉన్న 2.36 ఎకరాల భూమిని తన పేరుతో రిజిస్టర్‌ చేయించుకున్నారు. ఆ తర్వాత భూమిని చెన్నై నగరానికి చెందిన మేఘనాథన్, ఏఎం జయంతిలకు విక్రయించి సొమ్ము చేసుకున్నారు. కాగా బాధితుడు ఏలూరు రంగారెడ్డిలో అప్పట్లోనే న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు మంగళవారం సోమిరెడ్డితోపాటు వీఆర్‌ మేఘనాథన్, ఏఎం జయంతి, సర్వేయర్‌ సుబ్బరాయుడులపై 471, 468, 447, 427, 397 సెక్షన్ల కింద పోలీసలు కేసు నమోదు చేశారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు