కన్నతల్లినే కడతేర్చాడు...

14 Jul, 2020 10:55 IST|Sakshi
కమలాబాయి కుమార్తెతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే, ఏసీపీ

కర్రతో మోది హత్య చేసిన తనయుడు

కొంతకాలంగా డబ్బుకోసం వేధింపులు

దుగ్గొండి : నవమాసాలు మోసింది.. తాను పునర్జన్మ పొందుతూ కుమారుడికి జన్మనిచ్చింది. పెంచి పెద్ద చేసి ఆస్తినిచ్చింది.. చనిపోయాక తలకొరివిపెట్టి పున్నామ నరకం నుండి విముక్తి కల్పిస్తాడనుకుంటే ఆ కొడుకే ఆమె పాలిట కాలయముడయ్యాడు. కర్రతో మోది కడతేర్చడంతో పాటు శవాన్ని ఇంట్లోనే ఉంచి తాళం వేసి పరారయ్యాడు. ఈ ఘటన వరంగల్‌ రూరల్‌ జిల్లా దుగ్గొండి మండలం శివాజినగర్‌ గ్రామంలో సోమవారం మధ్యాహ్నం జరిగింది. వివరాల్లోకి వెళితే...

మండలంలోని శివాజినగర్‌ గ్రామానికి చెందిన కుసుంబ కమలాబాయి(65) భర్త కుసుంబ లింగయ్య 30 ఏళ్ల క్రితమే మరో వివాహం చేసుకుని హైదరాబాద్‌కు వెళ్లిపోయాడు. అప్పటినుండి కమలాబాయి తన కుమారుడు కుసుంబ రాజేందర్, కూతుళ్లు సుకినె రజిత(మాజీ జడ్పీటీసీ) మరో కూతురు రజినిని పెంచి పెద్ద చేసి పెళ్లిళ్లు జరిపించింది. ప్రస్తుతం ఆమె కుమారుడితోనే కలిసి ఉంటుండగా, కమలాబాయితో ఆమె కుమారుడు రాజేందర్‌ తరచూ డబ్బుల విషయంలో గొడవ పడేవాడు. ‘నీ దగ్గర డబ్బులు ఎన్ని ఉన్నాయి.. ఎవరికి ఇచ్చావు. తీసుకురాపో.. గ్రామంలో నీ పేరిట ఉన్న గుంట ఇంటి స్థలాన్ని అమ్మి నాకు ఇవ్వు.. నెలనెలా పించన్‌ డబ్బులు నాకే ఇవ్వాలి’ అని గొడవ పడుతుండేవాడు.

ఇదే క్రమంలో సోమవారం రాజేందర్‌ భార్య రాజేంద్ర పొలం పనులకు వెళ్లగా మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో రాజేందర్‌ తన తల్లి కమలాబాయితో గొడవ పడ్డాడు. ఇదేక్రమంలో మాటమాట పెరగగా కర్రతో కొట్టి చంపాడు. అనంతరం తనకేం తెలియదన్నట్లు ఇంటికి తాళం వేసి తన ద్విచక్రవాహనంపై పారిపోయాడు. ఇది ఇంటికి ఎదురుగా ఉన్న ఓ చిన్నారి గమనించి కమలాబాయి కూతురు సుకినె రజితకు వివరించింది. దీంతో రజిత పరుగు పరుగున వచ్చి కిటికీలోంచి చూడగా తల్లి రక్తపు మడుగులో విగతజీవిగా పడిఉంది. విషయం తెలుసుకున్న నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రె డ్డి శివాజీనగర్‌ చేరుకుని వివరాలు ఆరా తీ శారు. ఏసీపీ ఫణీందర్, సీఐ సతీష్‌బాబు, ఎ స్సై రవికిరణ్‌ చేరుకుని కుమార్తె రజిత ఇచ్చి న ఫిర్యాదు మేరకు కుసుంబ రాజేందర్‌– రా జేంద్ర దంపతులపై కేసు నమోదు చేశారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా