అమ్మ లేని లోకం వ్యర్థమని..

17 Jan, 2018 07:30 IST|Sakshi
ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియోలో సతీష్‌ , సతీష్‌ (ఫైల్‌)

ఆస్పత్రిలో మృత్యుశయ్యపై తల్లి

ఆమె మరణాన్ని తట్టుకోలేక తనయుని ఆత్మహత్య

రెండున్నర గంటల సెల్ఫీ వీడియోలో ఆవేదన

మైసూరు జిల్లాలో విషాదం

దేవుడు ప్రతిచోటా ప్రత్యక్షంగా ఉండలేడు కాబట్టి ఈ లోకంలో అమ్మను సృష్టించాడు అంటారు పెద్దలు. నవమాసాలూ మోసి కనిపెంచిన అమ్మ ప్రేమ మధురాతిమధురం. అటువంటి అమ్మ దూరమవుతోందని తెలిసిన ఒక కొడుకు అనూహ్యమైన నిర్ణయం తీసుకున్నాడు. మరో లోకంలోనైనా తన తల్లిని కలుసుకోవడానికి ఆమె కంటే కొన్ని నిమిషాల ముందే బలవంతంగా ప్రాణం తీసుకున్నాడు.

మైసూరు: అతనికి అమ్మ అంటే చాలా ఇష్టం. అమ్మ లేకుండా క్షణమైనా ఉండలేడు. తండ్రి మరణించినా, అన్నీ తానై అల్లారుముద్దుగా పెంచింది. అయితే విధి చిన్నచూపు చూసింది. క్యాన్సర్‌తో బాధపడుతున్న అమ్మ కొద్ది నిమిషాల్లో చనిపోతుందని తెలుసుకొని రెండున్నర గంటల పాటు సెల్ఫీ వీడియోలో తన ఆవేదన పంచుకుని ఆ వీడియోను స్నేహితులకు, బంధువులకు పంపించి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మైసూరు తాలూకాలోని వాజమంగళ గ్రామంలో చోటు చేసుకుంది.

ఆత్మహత్య చేసుకున్న యువకుడు వాజమంగళ గ్రామానికి చెందిన రత్నమ్మ కుమారుడు సతీష్‌ (29). వివరాలు.. రత్నమ్మ (45) గత కొంత కాలంగా కేన్సర్‌ వ్యాధితో బాధపడుతోంది. ఈమె భర్త కూడా కొన్ని సంవత్సరాల మరణించగా, తల్లీ కుమారుడే ఉంటున్నారు. తల్లి రత్నమ్మ అంటే సతీష్‌కు ఎంతో ప్రేమ. కొన్ని రోజుల నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రత్నమ్మ చావుకు దగ్గరలో ఉన్నదని వైద్యులు తేల్చిచెప్పారు. అప్పటినుంచి అమ్మ కోసం తపిస్తూనే  ఉన్నాడు. సోమవారం అర్ధరాత్రి వైద్యులు ఆమెను పరిశీలించి, ఇక ప్రయోజనం లేదని, ఇంటికి తీసుకెళ్లవచ్చని చెప్పారు. వెంటనే ఇంటికి వచ్చిన సతీష్‌ సుమారు రెండున్నర గంటల పాటు తన మొబైల్‌ ఫోన్‌లో తన ఆవేదన వెళ్లగక్కి ఉరికొయ్యకు వేలాడాడు. కాగా, వైద్యులు పరీక్షించిన కొద్దిసేపటికే రత్నమ్మ కన్నుమూసింది.

స్నేహితులారా.. మిమ్మల్ని మోసం చేస్తున్నా
తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని, తన ఆత్మహత్య కు ఎవరు కారణం కాదని, మా అమ్మను వదిలి నేను ఉండలేనని అందులో తెలిపారు. ‘నా స్నేహితులందరికి నా చివరి నమస్కారాలు. మా అమ్మను వదిలి ఉండలేను అందుకే నే ను ఆత్మహత్య  చేసుకుంటున్నాను. ఇలా ఆత్మహత్య చేసుకో వడం ద్వారా నా స్నేహితులందరికీ మోసం చేస్తున్నాను. స్నేహితులు కుమారణ్ణ, విను, జీతు, గిరిష్, వినోద్, యోగేష్, ఇతర స్నేహితుళు అందరికి నా చివరి నమస్కారాలు. అందరు నన్ను క్షమించండీ అని తెలిపారు.

మరిన్ని వార్తలు