ప్రాణం తీసిన ఆస్తి తగాదా

8 Apr, 2019 11:50 IST|Sakshi
మృతదేహం వద్ద రోదిస్తున్న కుటుంబ సభ్యులు

తండ్రిని హతమార్చిన కొడుకు

ముత్యాలమ్మ తండాలో ఘటన

కేసముద్రం: కడుపున పుట్టిన కొడుకే కన్న తండ్రి పాలిట కాలయముడయ్యాడు. అల్లారు ముద్దుగా పెంచుకున్న ఒక్కగానొక్క కొడుకే ఆస్తి కోసం తండ్రిపై దాడిచేసి హతమార్చిన విషాదకర ఘటన మహబూబాబాద్‌ జిల్లాలోని కేసముద్రం మండలం ఇంటికన్నె శివారు ముత్యాలమ్మ తండాలో చోటు చేసుకుంది. ఎస్సై సతీష్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ముత్యాలమ్మ తండాకు చెందిన భుక్యా మంగ్యా(53)–చంద్రమ్మ దంపతులకు కుమారుడు వీరన్న, మగ్గురు కుమార్తెలున్నారు. వారు తమకున్న 4ఎకరాల భూమిలో వ్యవసాయం చేసుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తున్నా రు. మంగ్యా ఇద్దరు కుమార్తెలతోపాటు, కొడుకు పెళ్లి చేశాడు.

యేడాదిన్నర క్రితం చంద్రమ్మ అనారోగ్యంతో గురవడంతో  చికిత్స చేయించా రు. ఆమె వైద్య ఖర్చుల కోసం రూ.7లక్షల అప్పు తీసుకువచ్చారు. అనంతరం చంద్రమ్మ ఆరోగ్య పరిస్థితి విషమించి మృతి చెందింది. వైద్య ఖర్చు ల కోసం చేసిన రూ.7లక్షల అప్పును తీర్చడానికి భూమిని అమ్మాలంటూ తండ్రితో వీరన్న తరచు గొడవ పడుతున్నాడు. భూమిని అమ్మవద్దంటూ తండ్రి వాదిస్తూ వచ్చాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి మళ్లీ భూమి విషయంలో తండ్రి, కొడుకుల మధ్య వాగ్వాదం మొదలైంది. ఆగ్రహనికి గురైన కొడుకు తండ్రిపై దాడిచేయడానికి ప్రయత్నించా డు. అతడు పరుగెత్తుకుంటూ వెళ్తుండగా నెట్టివేశాడు. దీంతో ఒక్కసారిగా రోడ్డుపై పడిన మంగ్యా తలకు తీవ్రగాయమై అక్కడికక్కడే మృతిచెందా డు.

గమనించిన కుటుంబ సభ్యులు, చుట్టుపక్కలున్న వారంతా కేకలు పెడుతూ ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంగ్యాను లేపిచూడగా అప్పటికే మృతిచెంది నట్లు వారు గుర్తించారు. తాతయ్య చనిపోయిన విషయాన్ని జీర్ణించుకోలేని మనుమండ్లు రోదించిన తీరు స్థానికులను కంటతడి పెట్టించింది. ఘటనా స్థలాన్ని రూరల్‌ సీఐ వెంకటరత్నం, ఎస్సై సతీష్‌లు ఆదివారం పరీశీలించారు. మృతుడి తమ్ముడు రాములు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మానుకోట ఆస్పత్రికి తరలించారు. నిందితుడు వీరన్నను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై తెలిపారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా