అమానుషం.. కొడుకు పెట్టే హింస భరించలేక...

2 Feb, 2018 18:48 IST|Sakshi

జైపూర్‌ : వృద్ధాప్యంలో ఉన్న తల్లికి సేవలు చేయటం ఆ కొడుకు భారమైపోయింది. అమానుషానికి తెగబడ్డాడు. ఇష్టం వచ్చినట్లు ఆమెపై దాడికి పాల్పడ్డాడు. కన్న కొడుకు పెట్టే హింసను కొన్ని రోజులు భరించిన తల్లి చివరకు ప్రాణాలు వదిలింది. రాజస్థాన్‌లోని అల్వార్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. 

జోగేంద్ర చౌదరి స్థానికంగా ఓ స్కూల్‌లో ఆంగ్ల ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు . తండ్రి చనిపోవటంతో తల్లి కొడుకు జోగేంద్ర వద్దకు చేరింది. అయితే వయో భారం, పైగా ఈ మధ్యే పక్షవాతం సోకటంతో ఆమె సొంతగా పనులు చేసుకోలేకపోతోంది. దీంతో ఇంట్లో వాళ్ల సాయం తీసుకుంటోంది. ఈ క్రమంలో జోగేంద్రకు.. అతని భార్యకు తరచూ గొడవలు జరుగుతున్నాయి. భార్యపై కోపంతో జోగేంద్ర తల్లిని హింసించటం ప్రారంభించాడు. ఆ బాధలను భరించలేక తొమ్మిది రోజుల క్రితం ఆ కన్నతల్లి కన్నుమూసింది. 

అయితే ఆమె మనవడు మాత్రం జోగేంద్ర ఓరోజు తల్లిని హింసిస్తుండగా వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్టు చేశాడు. ఆ వీడియో వైరల్‌ అయి చివరకు విషయం పోలీసుల దాకా చేరటంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు