కాపుసారాపై మెరుపు దాడులు!

26 Oct, 2019 03:44 IST|Sakshi
శుక్రవారం కర్నూలు జిల్లా ప్యాపిలి మండలం అలేబాదుతండా వద్ద నాటుసారా బట్టీని ధ్వంసం చేస్తున్న ఎక్సైజ్‌ అధికారులు

ఈ వారమంతా స్పెషల్‌ డ్రైవ్‌ 

రంగంలోకి ప్రత్యేక బృందాలు 

191 మండలాల్లోని 682 గ్రామాల్లో కాపు సారా ప్రభావం

ఫిర్యాదులు చేసేందుకు ప్రత్యేక టోల్‌ ఫ్రీ నంబర్‌ 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కాపుసారాను అరికట్టేందుకు కఠినంగా వ్యవహరించాలని అన్ని జిల్లాల డిప్యూటీ కమిషనర్లను ఎక్సైజ్‌ శాఖ ఆదేశించింది. ప్రత్యేక బృందాల ద్వారా ఈ వారం అంతా ఆకస్మిక దాడులు చేపట్టాలని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు నిర్ణయించారు. నాటుసారాపై ఫిర్యాదులు స్వీకరించి దాడులు చేసేందుకు ఎక్సైజ్‌ కమిషనరేట్‌లో 1800 425 4868 టోల్‌ ఫ్రీ నంబరుతోపాటు రెండు బెటాలియన్ల పోలీసులను సిద్ధం చేశారు. గ్రామ వలంటీర్లు, గ్రామ సచివాలయాల్లో నియమించిన మహిళా పోలీసుల సహకారంతో సారా మహమ్మారిని తరిమికొట్టాలని ఎక్సైజ్‌ యంత్రాంగాన్ని ఆదేశించారు. 

మూడు కేటగిరీలుగా విభజన 
రాష్ట్రంలోని 191 మండలాల్లో కాపుసారా ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. 682 గ్రామాల్లో కాపుసారా తయారీ, విక్రయాలు జోరుగా జరుగుతున్నట్లు ఎక్సైజ్‌ అధికారుల వద్ద సమాచారం ఉంది. తూర్పు గోదావరి, కర్నూలు, విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లో దీనిప్రభావం అత్యధికంగా ఉంది. కాపు సారా తయారీని ‘ఏ’ కేటగిరీ, విక్రయాలను ‘బి’ కేటగిరీ, సరఫరాను ‘సీ’ కేటగిరీగా విభజించారు. ఏ కేటగిరీలో 141 గ్రామాలు, బీ కేటగిరీలో 249 గ్రామాలు, సీ కేటగిరీలో 292 గ్రామాలున్నాయి.  

నాలుగు నెలల్లో 5,687 కేసులు  
వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత నాలుగు నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా కాపుసారా తయారీపై 5,687 కేసులు నమోదు చేసినట్లు ఎక్సైజ్‌ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 3,410 మందిని అరెస్ట్‌ చేసి కేసులు నమోదు చేశారు. అక్రమ మద్యం కేసులు అధికంగా అనంతపురం, కర్నూలు జిల్లాల్లో నమోదయ్యాయి. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో కేవలం ఒక కేసు మాత్రమే నమోదు కావడం గమనార్హం. దాడుల్లో 378 వాహనాల్ని సీజ్‌ చేశారు.  

రెండు నెలల్లో నియంత్రిస్తాం
రాష్ట్రంలో సారా అనేది లేకుండా చేయాలని సీఎంవో నుంచి ఆదేశాలు అందాయి. రెండు నెలల్లో కాపు సారాను నియంత్రించేలా కార్యాచరణ రూపొందించాం. ‘ఏ’ కేటగిరీ గ్రామాల్లో స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించి తయారీదారుల సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతాం.
– ఎం.ఎం. నాయక్, ఎక్సైజ్‌ కమిషనర్‌

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఇసుక అక్రమార్కులపై ఉక్కుపాదం

విద్యార్థి చేయి విరగ్గొట్టిన ‘శ్రీచైతన్య’ టీచర్‌ 

ప్రేమజంట ఆత్మహత్యాయత్నం

మహిళ కిడ్నాప్‌.. సామూహిక అత్యాచారం..!

పాఠశాలలో విద్యుత్‌ వైరు తగిలి విద్యార్థి మృతి

కోర్టులో లొంగిపోయిన అచ్చెన్నాయుడు

రూ. 7లక్షల నగదుకు అరకిలో బంగారు నాణేలు

ఆ బస్సు అటు ఎందుకు వచ్చినట్టు? 

షార్ట్‌ సర్క్యూట్‌తో పేలిన టీవీ

హయత్‌నగర్‌లో చెడ్డీ గ్యాంగ్‌ హల్‌చల్‌

కన్నకొడుకుని కాల్చిచంపాడు..

వైరాలో ముసుగుదొంగ 

మెట్రోలో రూ. కోటి తీసుకెళుతూ..

శ్రీనవ్య జ్ఞాపకాలు మరువలేక...

టార్గెట్‌ ఏటీఎం

టిక్‌–టాక్‌పై మోజుతో...

ప్రియురాలి కారుతో ప్రియుడు పరారీ

పోలీసుల అదుపులో కోడెల బినామీ! 

టీవీ సీరియల్‌ కెమెరామెన్‌ ఆత్మహత్య

సైనేడ్‌ కిల్లర్‌కు మరణశిక్ష

నా భార్య వద్దకే వెళ్లిపోతున్నాం..

బస్టాండ్‌లో నాలుగేళ్ల చిన్నారిపై.. 

అక్రమ రవాణాపై ప్రభుత్వ కొరడా..

భీతిల్లుతున్న మన్యం

ఇంజనీరింగ్ విద్యార్థులే లక్ష్యంగా ...

బండ్ల గణేష్‌కు రిమాండ్‌, కడప జైలుకు తరలింపు

దర్శకుడిపై హీరోయిన్‌ ఫిర్యాదు

వారిని గోదారమ్మ మింగేసిందా?

తప్పుడు పనులు చేయిస్తున్నారు..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

చిన్న గ్యాప్‌ తర్వాత...

ఉంగరాల టీనా

ద్రౌపదిగా దీపిక

85 ఏళ్ల కాజల్‌!

ఆర్టికల్‌ 370 కథ

ఒకటికి మూడు