ఇంటర్‌ విద్యార్థి ఆత్మహత్య

27 Sep, 2018 09:14 IST|Sakshi
రోదిస్తున్న సాయికిరణ్‌ తల్లిదండ్రులు సాయికిరణ్‌(ఫైల్‌)

బోడుప్పల్‌:  ఇంటర్మీడియట్‌ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన బుధవారం మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఎస్‌ఆర్‌ కాలేజీలో చోటు చేసుకుంది. ఎస్సై రఘ రాం,  విద్యార్థులు తల్లిదండ్రుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. యాదాద్రి జిల్లా, ఆత్మకూరుకు చెందిన బొడిగె లక్ష్మినారాయణ, స్వాతి దంపతుల కుమారుడు సాయికిరణ్‌(17) బోడుప్పల్‌లోని ఎస్‌ఆర్‌ కాలేజీలో ఇంటర్మీడియట్‌ ఎంపీసీ మొదటి సంవత్స రం చదువుతున్నాడు.  బుధవారం మధ్యాహ్నం తోటి విద్యార్థులు భోజనం చేసేందుకు వెళ్లగా, గదిలో ఒంటరిగా ఉన్న సాయికిరణ్‌ టవల్‌తో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.  దీనిని గుర్తించిన కాలేజీ నిర్వాహకులు అతడిని స్పార్క్‌ హాస్పిటల్‌కు తరలించగా, పరీక్షించిన వైద్యులు అతను అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. 

యాజమాన్యం వేధింపులే కారణం...
తమ కుమారుడి మృతికి ఎస్‌ఆర్‌ కాలేజీ యాజమాన్యం వేధింపులే కారణమని మృతుని తల్లిదండ్రులు లక్ష్మినారాయణ, స్వాతి ఆరోపించారు. చదువు పేరుతో ఒత్తిడి చేసినందునే అతను ఆత్మహత్యకు పాల్పడ్డాడని తెలిపారు.  బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. 

చదువుకోవడం ఇష్టం లేకే....
హాస్టల్‌లో ఉండి చదువుకోవడం ఇష్టం లేకే సాయికుమార్‌ ఆత్మహత్యకు పాల్పడ్డాడని కాలేజీ నిర్వాహకులు తెలిపారు.   జూలై 22న అతను తమ కాలేజీలో చేరాడని అంతకు ముందు సింగ పూర్‌ టౌన్‌షిప్‌లోని నారాయణ కాలేజీలో చదువు కున్నాడన్నారు. అక్కడ కూడా చదువుకోవడం ఇష్టం లేక ఆత్మహత్యకు యత్నించినట్లు వారు తెలి పారు. బయట ఉండేందుకే అతను ఇష్టపడ్డాడని, అయితే తల్లిదండ్రులు బలవంతంగా హాస్టల్‌లో ఉంచినందునే ఆత్మహత్య చేసుకున్నట్లు వారు పేర్కొన్నారు. విద్యార్థి సంఘాలు, వివిధ రాజకీ య పార్టీల నేతలు బోడుప్పల్‌లోని కాలేజీ వద్ద ఆందోళన చేపట్టారు. కాలేజీ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

మరిన్ని వార్తలు