వివేక హత్యపై  జనాగ్రహం

17 Mar, 2019 04:40 IST|Sakshi

రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు

సాక్షి,నెట్‌వర్క్‌: మాజీ మంత్రి వైఎస్‌ వివేకా హత్యపై జనాగ్రహం వెల్లువెత్తుతోంది.హత్యా రాజకీయాలకు నిరసనగా శనివారం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి.  గుంటూరు జిల్లా   నరసరావుపేటలో ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యే ముస్తఫా, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మర్రి రాజశేఖర్,  మోదుగుల వేణుగోపాలరెడ్డి, పాదర్తి రమేష్‌గాంధీ శాంతి ర్యాలీ నిర్వహించారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో లేళ్ళ అప్పిరెడ్డి,  మోదుగుల వేణుగోపాలరెడ్డి,  తాడికొండ సమన్వయకర్త ఉండవల్లి శ్రీదేవి, పాదర్తి రమేష్‌గాంధీ అంబేడ్కర్‌ విగ్రహం వరకు ప్రదర్శన నిర్వహించారు. మంగళగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి, బాపట్లలో ఎమ్మెల్యే కోన రఘుపతి, మాచర్లలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పెదకూరపాడులో నంబూరు శంకరరావు, వేమూరులో ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున, వినుకొండలో బొల్లా బ్రహ్మనాయుడు శాంతి ర్యాలీ నిర్వహించి మహాత్మాగాంధీ,  అంబేడ్కర్‌ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. విశాఖలోని పెదవాల్తేరు, గోపాలపట్నం, సింహాచలం, మధురవాడ, జిల్లాలో అనకాపల్లి,  పాయకరావుపేట, యలమంచిలి, నక్కపల్లిలో పార్టీ శ్రేణులు  నిరసన తెలిపారు. పాడేరు, చింతపల్లిలో జరిగిన నిరసన కార్యక్రమాల్లో పాడేరు నియోజకవర్గ సమన్వయకర్త ఎం.విశ్వేశ్వరరాజు పాల్గొన్నారు. పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా శాంతియుత నిరసనలు జరిగాయి.

ఏలూరులోని చాణక్యపురి కాలనీలో, దేవరపల్లి, పోలవరంలోజరిగిన కార్యక్రమాల్లో వైఎస్సార్‌ సీపీ నేతలు ఎమ్మెల్సీ ఆళ్ళ నాని, తలారి వెంకట్రావు, మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు పాల్గొన్నారు. విజయనగరం జిల్లాలో పలు చోట్ల వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో  నిరసనలు పెల్లుబికాయి. సాలూరు, పార్వతీపురం,నెల్లిమర్ల ,బొబ్బిలిలో ఎమ్మెల్యే రాజన్నదొర, అలజంగి జోగారావు,బడ్డుకొండ అప్పలనాయుడు, శంబంగి చినప్పలనాయుడు ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో మాజీ మంత్రి బాలినేని, అద్దంకిలో బాచిన చెంచుగరటయ్య దర్శి నియోజకవర్గం దొనకొండలో మద్దిశెట్టి వేణుగోపాల్, కొండపి నియోజకవర్గంలోని టంగుటూరులో మాదాసి వెంకయ్య ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీలతో నిరసన చేపట్టారు. అనంతపురంలో వైఎస్సార్‌ సీపీ ఆధ్వర్యంలో గాంధీ బొమ్మ వద్ద నల్ల బ్యాడ్జీలు, నల్ల చొక్కాలు ధరించి నిరసన తెలిపారు.

రాయదుర్గంలో మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ మెట్టుగోవిందరెడ్డి ఆధ్వర్యంలో వివేకా చిత్రపటంతో శాంతి ర్యాలీ నిర్వహించారు. హిందూపురంలో నవీన్‌నిశ్చల్, కొండూరు వేణుగోపాల్‌రెడ్డి, పుట్టపర్తిలో దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో గాంధీ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చారు. రాప్తాడు, చెన్నేకొత్తపల్లి,కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని కుందుర్పి, శెట్టూరు,  మండలాల్లో నల్ల బ్యాడ్జీలతో నిరసన ర్యాలీలు నిర్వహించారు. శ్రీకాకుళంలో నల్లరిబ్బన్లతో జరిగిన నిరసన ర్యాలీలో వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షురాలు కిల్లి కృపారాణి, కిల్లి రామ్మోహన్‌రావు, శిమ్మ రాజశేఖర్, అంధవరపు సూరిబాబు పాల్గొన్నారు. పాలకొండలో ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి ఆధ్వర్యంలో నిరసన చేశారు. నరసన్నపేట, రణస్థలం, ఆమదాలవలస, ఇచ్ఛాపురంల్లో పార్టీ శ్రేణులు నిరసన తెలిపాయి.  తూర్పు గోదావరి జిల్లాలోని వైఎస్సార్‌ సీపీ శ్రేణులు  నిరసన కార్యక్రమాలు నిర్వహించాయి.  కర్నూలు  జిల్లాలో పార్టీ శ్రేణులు శాంతిర్యాలీలు చేపట్టాయి. ఆత్మకూరులో శిల్పా భువనేశ్వరరెడ్డి, డోన్‌లో ఎమ్మెల్యే ఇంటి నుంచి పాతబస్టాండ్‌లోని జాతిపిత విగ్రహం వరకు జెడ్పీటీసీ సభ్యుడు శ్రీరాములు ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. ఆదోనిలో ఎమ్మెల్యే తనయుడు మనోజ్‌రెడ్డి,  పత్తికొండలో సమన్వయకర్త శ్రీదేవి ఆధ్వర్యంలో ర్యాలీలు చేపట్టారు.

నెల్లూరు జిల్లాలో: వైఎస్‌ వివేకానందరెడ్డి దారుణహత్యకు నిరసనగా  శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి.కోవూరు నియోజకవర్గం బుచ్చిరెడ్డిపాళెంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, గూడూరు నియోజకవర్గం గూడూరు, వాకాడు, చిల్లకూరు మండలాల్లో  మాజీ ఎంపీ వరప్రసాద్‌ నేతృత్వం నిరసన ప్రదర్శనలు జరిగాయి. ఉదయగిరి, జలదంకిల్లో,  సూళ్లూరుపేట, నాయుడుపేట పట్టణాల్లో ర్యాలీలు జరిగాయి. నెల్లూరు రూరల్‌ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయం  నుంచి నేతలు కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు. ఆత్మకూరు, వెంకటగిరి పట్టణాల్లో వైఎస్సార్‌ పార్టీ నేతలు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు.

చిత్తూరు జిల్లాలో: వివేకా హత్యకు నిరసనగా చిత్తూరు జిల్లాలో పార్టీలకతీతంగా ప్రజలు నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తిరుపతిలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర రెడ్డి, చిత్తూరులో నియోజకవర్గ సమన్వయకర్త జంగాలపల్లి శ్రీనివాసులు, సత్యవేడు, వరదయ్యపాళెంలో నాయుడు దయాకర్‌రెడ్డి, సుశీల్‌కుమార్‌రెడ్డి, తిరుపతి పార్లమెంట్‌ మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి మస్తాని, పీలేరు నియోజకవర్గం వాల్మీకిపురం, కేవీ పల్లిలో వైఎస్సార్‌సీపీ శ్రేణులు నిరసన తెలియజేసి టీడీపీ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కుప్పంలో వైఎస్సార్‌సీపీ నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు.  శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలోని రేణిగుంటలో సిద్దయ్యగుంట సుధాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జిలతో నిరసన తెలియజేశారు.

మరిన్ని వార్తలు