గంగాళమ్మ పంచలోహ విగ్రహం చోరీ

3 Oct, 2017 08:36 IST|Sakshi
గంగాళమ్మ ఆలయంలో మిరప్పొడి చల్లిన దృశ్యం

నెల్లూరు, రాపూరు: గోనుపల్లి పంచాయతీ వంకివోలు పునరావాస కాలనీలోని గ్రామదేవత గంగాళమ్మ ఆలయంలో సోమవారం వేకువన గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. గంగాళమ్మ పంచలోహ విగ్రహాన్ని అపహరించారు. వివరాలు..వైఎస్సార్‌ జిల్లా పెనగలూరు మండలం మర్లబైలు గ్రామం సోమశిల జలాశయంలో ముంపునకు  గురవగా గోనుపల్లి పంచాయతీ పరిధిలోని వంకివోలు కాలనీలో ప్రభుత్వం పునరావాసం కల్పించింది. మర్లబైలు గ్రామదేవత గంగాళమ్మను వంకివోలు కాలనీలో ప్రతిష్టించి పూజలు జరుపుతున్నారు. సోమవారం వేకువన గుర్తుతెలియని వ్యక్తులు ఆలయ తాళాలు పగులగొట్టి అతి పురాతనమైన గంగాళమ్మ పంచలోహ విగ్రహాన్ని అపహరించారు.  పోలీసు జాగిలం వాసన పసి గట్టకుండా, క్లూస్‌టీం వేలిముద్రలు సేకరించకుండా ఆలయం వద్ద దుండగులు మిరప్పొడి చల్లారు. ఉదయం గ్రామస్తులు చోరీని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మరిన్ని వార్తలు